Site icon NTV Telugu

Sri Bharath : స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు నిజమే.. ఎంపీ శ్రీ భరత్ క్లారిటీ

Sri Bharath

Sri Bharath

Sri Bharath : స్టీల్ ప్లాంట్ లో కార్మికులను తొలగిస్తున్నారంటూ వస్తున్న రూమర్లపై తాజాగా ఎంపీ శ్రీ భరత్ స్పందించారు. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికులను తొలగించిన మాట వాస్తవమే అన్నారు. కంపెనీ మేనేజ్ మెంట్ అవసరం అయిన వారిని ఉంచి మిగతా కాంట్రాక్టు కార్మికులను తొలగించారని చెప్పారు భరత్. కంపెనీని తిరిగి లాభాల్లోకి తేవడానికే ఇలాంటి చర్యలు చేపడుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. బ్లాస్ట్ ఫర్నిస్ త్రీ ప్రారంభించినప్పుడు అవసరమైతే కార్మికులను తిరిగి తీసుకుంటామని చెప్పుకొచ్చారు. తీసేసిన వారిలో సమర్థవంతంగా పనిచేసిన వారు ఎవరైనా ఉంటే వారిని తిరిగి తీసుకోవాలని మేనేజ్ మెంట్ కు వివరించామన్నారు.

Read Also : Kannappa : కన్నప్ప సినిమాను అడ్డుకుంటాం.. బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం

ప్లాంట్ ని లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు కార్మికులు యాజమాన్యం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు జరిగిన కొన్ని లోపాలను సరిదిద్దుకుంటూ మేనేజ్ మెంట్ ముందుకు వెళ్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కూడా అన్ని సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పులు చేస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మేనేజ్ మెంట్ చర్యలు చేపడుతోందని వివరించారు శ్రీ భరత్. కూటమి ప్రభుత్వం వచ్చాకనే స్టీల్ ప్లాంట్ కు కేంద్రప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు.

Read Also : Malladi Vishnu : ఐదెకరాల కోసమే శాతవాహన కాలేజీని కూల్చేశారు.. మల్లాది విష్ణు ఆరోపణలు

Exit mobile version