Site icon NTV Telugu

MP Santosh Kumar : ఈశా ఆశ్రమంలో మొక్కలు నాటి ఎంపీ సంతోష్‌ కుమార్‌

Santosh Kumar

Santosh Kumar

మహాశివరాత్రి పురస్కరించుకుని కోయంబత్తూరు లోని ఈశా ఆశ్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ దంపతులు చేరుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఈశా ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులతో కలిసి గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించిన సద్గురు ఆహ్వానం మేరకు వేడుకల్లో పాల్గొనేందుకు తన సతీమణి తో కలిసి కోయంబత్తూరు ఈశా ఆశ్రమానికి ఎంపీ సంతోష్ కుమార్ చేరుకున్నారు.

Also Read : MS Dhoni: ధోనీ గ్యారేజీలోకి కొత్త బైక్‌.. టీవీఎస్ రోనిన్ ప్రత్యేకతలు ఇవే!

ఈ సందర్భంగా ఆశ్రమంలోని స్కూల్ విద్యార్థులతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, పలు అంశాలపై చర్చించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈశా వాలంటీర్లు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : Home Loan Comparison : ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి హోం లోన్ ఇస్తుందంటే..

Exit mobile version