NTV Telugu Site icon

MP Sanjeev Kumar : టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్

Mp Sanjeev

Mp Sanjeev

చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ చేరారు. పార్టీ కండువా కప్పి సంజీవ్ కుమార్ ను సాదరంగా చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. పొయ్యిమీద కాలుతున్న కుండను ముట్టుకునే ప్రయత్నం చేస్తే చెయ్యి కాలుతుందన్నారు. నాతో సహా రాష్ట్ర ప్రజలు వైసీపీను ఓసారి ముట్టుకుని ఆ తప్పు చేశారని ఆయన విమర్శించారు. రెండో చెయ్యి కూడా కాల్చుకోవద్దని ప్రజల్ని కోరుతున్నానన్నారు సంజీవ్‌ కుమార్‌. కర్నూల్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తెలుగుదేశంలో చేరా అని ఆయన వెల్లడించారు. ఎలాంటి సీటు ఆశించకుండా భేషరతుగానే తెలుగుదేశంలో చేరానని ఆయన పేర్కొన్నారు.

PM Modi Visit to Telangana: రేపు రాష్ట్రానికి ప్రధాని మోడీ.. మల్కాజ్‌గిరిలో రోడ్‌షో

విశ్వ ప్రయత్నాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు తెచ్చుకోలేకపోయానని సంజీవ్ కుమార్ తెలిపారు. మూడు పార్టీల పొత్తు అభివృద్ధికి మంచి చిహ్నమన్నారు. కర్నూల్ లో ఉన్న సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సంజీవ్ పేర్కొన్నారు. తగు ప్రత్యామ్నాయo చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, వైసీపీ పాలనలో కంఠ శోష తప్ప ఏమీ లేదని ఆయన అన్నారు. ఆ పార్టీలో కల్పించేది ఉత్తుత్తి సామాజిక న్యాయమన్నారు ఎంపీ సంజీవ్‌ కుమార్‌. బీసీలకు వైసీపీలో ఉత్సవ విగ్రహాల తరహా పదవులే తప్ప ప్రాధాన్యం లేదని, కర్నూల్ ప్రాంతం నుంచి వలసలు, దారిద్య్రం నివారించలేకపోయాననే బాధ ఉందన్నారు. 2 నదుల మధ్యలో ఉన్న కర్నూల కు తాగు నీరు కూడా ఇవ్వలేనప్పుడు ఇక ఎంపీగా ఎందుకన్పించిందని, ముఖ్యమంత్రి అపాయిట్మెంట్ కూడా వైసీపీలో దొరకటం గగనమే అని ఆయన వ్యాఖ్యానించారు.

Viral: ఎలావస్తాయో ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ జామ్‌ లో ఆ మహిళ చేసిన పనిచూస్తే వావ్ అనాల్సిందే..!