NTV Telugu Site icon

MP Ranjith Reddy : చిలుకూరు బాలాజీ నుంచి ఎంపీ రంజిత్​ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్​ షురూ

Mp Ranjith Reddy

Mp Ranjith Reddy

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్​ నగరవ్యాప్తంగా ఎంతోగానో ప్రాచుర్యం పొందిన చిలుకూరు బాలాజీ దేవస్థానం నుంచి చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు డాక్టర్​ జి.రంజిత్​ రెడ్డి తన ఎన్నికల క్యాంపెయిన్​ను మంగళవారం(ఏప్రిల్​ 9వ తేదీ నుంచి) షురూ చేశారు. తమ ఇంటి దేవుడు(ఇలవేల్పు) శ్రీ వెంకటేశ్వరుడికి కుటుంబ సభ్యులతో సంయుక్తంగా చిలుకూరులో పూజలు నిర్వహించిన తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 45 రోజుల పాటు ఆయన చేవెళ్ళ పార్లమెంట్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియెజకవర్గాల్లో అన్ని మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటన చేయనున్నారు. ఈ ప్రచారంలో ఎంపీ రంజిత్​ రెడ్డితో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీలు, ఆయన కుటుంబీకులు సైతం పాల్గొననున్నారు.

 

చిలుకూరి బాలాజీ పూజా కార్యక్రమంలో సతీమణి, టీటీడీ బోర్డు మెంబర్​ గడ్డం సీతా రంజిత్​ రెడ్డి, కుమార్తె అల్లుడు పూజా ఆకాంక్ష రెడ్డి, టీ రాజేశ్​ రెడ్డి, కుమారుడు రాజ్​ ఆర్యన్​ రెడ్డి తదితర కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. కాగా, ఆయన వేరే ఏ నాయకుడిలాగా హైదరాబాద్​ నగరానికే పరిమితం కాకుండా తన నియోజకవర్గమైన చేవెళ్ళలోని మొయినాబాద్​ మండలం యెంకపల్లిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్న విషయం తెలిసిందే.

 

Show comments