సీఎం జగన్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి గెలిచారు.. కానీ, గెలిచాక ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయలేకపోయారని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. వైసీపీ ఇచ్చిన 730 హామీల్లో 621 హామీలు అమలు చేయలేదు.. రాష్ట్రం అతలాకుతలంగా మారింది అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేదు.. 99.5 శాతం హామీలు అమలు చేసామని కల్లబోల్లి కబుర్లు చెబుతున్నారు.. అధికార పార్టీ నుంచి చర్చకు రండి.. హామీలపై చర్చిద్దాం అని సవాల్ చేశారు. ప్రెస్ మీట్ కూడా పెట్ట లేని ముఖ్యమంత్రి జగన్ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.
Read Also: Cocaine : హెయిర్ కండీషనర్, బాడీ వాష్ బాటిళ్లలో రూ.15 కోట్ల విలువైన కొకైన్.. మహిళా స్మగ్లర్ అరెస్ట్
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి.. ఒక్క నోటిఫికేషన్ సరిగ్గా చేయలేదు అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. జాబ్ క్యాలేండరు కూడా లేదు.. ప్రత్యేక హోదాపై ఒక్క వైసీపీ ఎంపీ కూడా నోరు మెదపడంలేదు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై పోరాటం చేయలేని దద్దమ్మలు వైసీపీ నాయకులు.. రైల్వేజోన్ కి మేం పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో స్పష్టం చేసింది.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని.. దోచుకుందాం దాచుకుందాం అనే ధోరణిలోనే వైసీపీ వాళ్లు ఉన్నారు అని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.
Read Also: Medigadda Project: మేడిగడ్డలో తెలంగాణ మంత్రుల పర్యటన.. మంత్రి ఉత్తమ్ ఏమన్నారంటే..
విశాఖపట్నం మొత్తం భూకబ్జాలు చేస్తున్నారు అని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది.. ఇసుక దోరక్క కార్మికులు ఉపాది లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. మద్యపాన నిషేధం అంటూ అబద్దపు ప్రచారం చేసారు.. మద్యం రేట్లు పెరుగుతున్నాయి తప్ప.. మద్యం నిషేధం లేదు.. పేద కుటుంబాల పైనా పన్నుల భారం వేస్తున్నారు.. 4 ఏళ్లలో శ్రీకాకుళం కలెక్టరేట్ కూడా కట్టలేక పోయారు.. ఆడుదాం ఆంధ్రా అంటే మీ అందరితో ఆడుతా అంటున్నాడు జగన్.. ఆర్దిక ఉగ్రవాది జగన్ తండ్రి అధికారంలో ఉండగానే దోచుకున్నాడు.. ఇప్పుడు వదిలేస్తాడా అని ఆయన అడిగారు. మంత్రి సిదిరి అప్పల రాజు సవాల్ ని స్వీకరిస్తున్నాం.. హామీల అమలు జిల్లా అభివృద్ధిపై చర్చకు మేం సిద్దంగా ఉన్నాం.. యూట్యూబ్ లలో లైక్ ల కోసం మంత్రి సీదిరి కాంట్రవర్శి కామెంట్స్ చేస్తున్నారు అని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.