Rape Case: ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. కామాంధుడిపై పోలీసుల కాల్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rape Case: మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలోని గౌహర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 6 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన మొత్తం రాష్ట్రాన్ని ఆగ్రహానికి గురిచేసింది. నవంబర్ 21వ తేదీ శుక్రవారం రాత్రి, ఓ కామాంధుడు బాలికపై అత్యాచారాని ఒడిగట్టాడు. దీంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన జరిగిన వెంటనే నిందితుడు పరారయ్యాడు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విస్తృతంగా నిరసనలు జరిగాయి. దీంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. సంఘటన జరిగిన ఏడవ రోజున నిందితుడు సల్మాన్ అలియాస్ నాజర్‌ను అరెస్టు చేశారు. భోపాల్‌లోని గాంధీనగర్‌లో అరెస్టు చేసిన.. రైసెన్‌కు తరలిస్తుండగా కిరాత్ నగర్ గ్రామం సమీపంలో నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు.
READ MORE: Anantapur Crime: అనంతపురంలో దారుణం.. డిప్యూటీ తాహసీల్దార్ భార్య, కుమారుడు మృతి!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
అయితే.. నిందితుడు సల్మాన్‌పై పోలీసుల రూ.30 వేల బహుమతి ప్రకటించారు. దీంతో భోపాల్‌లోని గాంధీనగర్ వార్డ్ నంబర్ 11లో ఒక టీ స్టాల్ వద్ద సల్మాన్ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. టీ తాగడానికి స్టాల్‌కు వచ్చిన సల్మాన్‌ను పోలీసులు వెంటనే పట్టుకున్నారు. అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత, గాంధీనగర్ పోలీసులు సల్మాన్‌ను గోహర్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. గోహర్‌గంజ్ పోలీసులు నిందితుడిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. దీంతో వారి వాహనం పంక్చర్ అయింది. పోలీసులు దిగి సరి చేస్తుండగా.. నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. కాలుకు బుల్లెట్ గాయం అయింది. అక్కడి నుంచి భోపాల్‌లోని జేపీ ఆసుపత్రికి తరలించారు. ఇంతలో, సల్మాన్ అరెస్టు గురించి తెలుసుకున్న జై మా భవానీ హిందూ సంస్థ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలికకు తక్షణ శస్త్రచికిత్స జరిగింది. ఆమె శరీరం తీవ్రంగా నలిగి పోయింది. అనేక సంక్లిష్ట చికిత్సలు జరిగాయి. బాలిక పూర్తిగా కోలుకోవడానికి చాలా నెలలు పడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. దాదాపు మూడు నెలల్లో మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చునని పేర్కొన్నారు. ప్రస్తుతం, బాలిక పరిస్థితి కొంతవరకు స్థిరపడుతుందని భావిస్తున్నారు.
READ MORE: Maharashtra: బీజేపీ-శివసేన మధ్య విభేదాలు! కూటమి నిలబడేనా?
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!