NTV Telugu Site icon

MP Raghunandan Rao : సీఎం రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు

Raghunandan Rao

Raghunandan Rao

సీఎం రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన చదువుకున్నది ఏడో తరగతి చేసే పని గోడలకు వేసే సున్నం కాబట్టి అలాంటి వాళ్లకు బడ్జెట్ అర్థం కాదని, కొంచెం చదువుకున్నోళ్లని పక్కన పెట్టి చూస్తే బడ్జెట్ లో తెలంగాణకి కేంద్రం ఏం ఇచ్చింది అనేది అర్థం అవుతుందన్నారు. తెలంగాణకి కేంద్రం రెండు పథకాల కిందే 50 వేల కోట్ల రూపాయలు వస్తున్నట్టు తెలంగాణ బడ్జెట్ కాపీలోని 4వ పేజీలో ఉందని, ఈ విషయాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పారన్నారు రఘునందన్‌ రావు. ఇది సీఎం రేవంత్ రెడ్డికి బడ్జెట్ పై ఉన్న అవగాహనకు అద్దం పడుతోందని, పైగా కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇండ్లను ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లుగా మార్చి ఇస్తారు తప్ప వేరేది కాదన్నారు ఎంపీ రఘునందన్‌ రావు.

Devara: సెకండ్ సింగిల్ అప్ డేట్ వచ్చేసింది..సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..?

బీజేపీపై బురద చల్లి, బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్లు పెరుగుతాయి కావొచ్చు..బిజెపికి మాత్రం పోయేదేం లేదని, రేవంత్ రెడ్డికి సమస్య ఏం దొరకటం లేదు కాబట్టి సమస్య చేస్తున్నాడన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం వచ్చినా రాకున్నా తెలంగాణకి వచ్చే వాటా వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కారుకూతలు కూసినా నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడో దఫా ఐదేళ్లు విజయవంతంగా పని చేస్తుందన్నారు. బడ్జెట్ పై దుష్ప్రచారం చేసే వారికి బడ్జెట్ అంటే ఏంటో తెలియదని తెలంగాణ సమాజం గ్రహించాలన్నారు. బడ్జెట్ లో తెలంగాణ పేరు రాలేదని అంటున్న రేవంత్ రెడ్డికి ఒకటే అడుగుతున్నా.. యూపీ, రాజస్థాన్, గుజరాత్ పేర్లు వచ్చాయా అని ప్రశ్నించారు.

Jagadish Reddy: విహార యాత్రలు కాంగ్రెస్ నేతలకు అలవాటు.. జీవన్ రెడ్డికి జగదీష్ రెడ్డి కౌంటర్