Site icon NTV Telugu

Purandeswari: వికలాంగ క్రీడాకారిణికి ధైర్యం నింపిన ఎంపీ పురంధేశ్వరి

Purandeswari

Purandeswari

Purandeswari: ఏపీ బీజేపీ‌ రాష్ట్ర కార్యాలయంలో వికలాంగ క్రీడాకారిణికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి ధైర్యం నింపారు. పారా బ్యాడ్మింటన్‌లో వీల్ చైర్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో పడాల రూపాదేవి బంగారు పతకాలు సాధించారు. వారధి కార్యక్రమంలో ఎంపీ పురంధేశ్వరిని రూపాదేవి కలిశారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేందుకు సహకరించాలని క్రీడాకారిణి రూపాదేవి విజ్ఞప్తి చేశారు.

Read Also: Minister Nadendla Manohar: రైతులకు గుడ్‌న్యూస్.. ధాన్యం విక్రయించిన 24గంటల్లో నగదు జమ

శ్రీకాకుళం జిల్లాకు చెందిన రూపాదేవి మైసూర్‌లో పారా బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. కుటుంబ బాధ్యతలు కూడా ఉండడంతో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని రూపాదేవి పురంధేశ్వరిని కోరారు. థాయిలాండ్, ఉగాండాలలో జరిగిన వీల్ చైర్ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొని రూపాదేవి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా రూపాదేవిని అధైర్యపడవద్దు అని పురంధేశ్వరి ధైర్యం చెప్పారు.

Exit mobile version