NTV Telugu Site icon

MP Nandigam Suresh: రోగాలున్నాయని చెప్పి చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చారు..

Mp Suresh

Mp Suresh

పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 350 కి పైగా కోట్ల రూపాయలు దోచేశారు అని ఆయన ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి భయం పరిచయం చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. నాకు రోగాలు ఉన్నాయి బెయిల్ ఇవ్వండి అని వేడుకుని చంద్రబాబు బయటకు వచ్చాడు.. అనుభవం ఉన్న వ్యక్తి కావాలని 2014లో చంద్రబాబుకి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు అని నందిగం సురేష్ అన్నారు.

Read Also: AFG vs NED: ఆఫ్గానిస్తాన్‌ అదుర్స్.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి

నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశాన్ని బీసీ, ఎస్సీలను వేధించడానికి ఉపయోగించారు అని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. అమరావతి ప్రాంతంలో ఎస్సీ, బీసీలకు ఇల్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టులలో కేసులు వేశారు అని ఆయన ఆరోపించారు. వెనుక బడిన వ్యక్తులను వేధించే దృతరాష్ట్ర కౌగిలి చంద్రబాబు ది.. అమ్మ దీవెన, ఇంగ్లీష్ మీడియంల కోసం జగన్ డబ్బు ఖర్చు పెడితే అడ్డుకోవాలని చంద్రబాబు చూసాడు.. తన మనవడి పేరు మీద మాత్రం వందల కోట్ల రూపాయల ఆస్తులు కుడబెట్టాడు అని నందిగం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వెనుక బడిన వర్గాలను జైళ్లలో పెడితే జగన్ ప్రభుత్వ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చింది.. రాబోయే ఎన్నికలే కాదు మరో పాతికేళ్ల కాలం జగన్ సీఎంగా ఉండాలి అని ఆయన పేర్కొన్నారు.