NTV Telugu Site icon

Nama Nageswara Rao : దేశంలో ఏ ప్రభుత్వం చేయని పనులు రాష్ట్రంలో చేశాం

Nama Nageswara Rao

Nama Nageswara Rao

టీఆర్‌ఎస్‌ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చేందుకు ఇటీవల ఎన్నికల సంఘం అధికారికంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే.. డిసెంబర్‌ 9న బీఆర్‌ఎస్‌ గా టీఆర్‌ఎస్‌ ఆవిర్భించింది. అయితే.. ఇక జాతీయ రాజకీయాల్లో అడుగులు వేయడమే తరువాయి. అందుకు అనుగుణంగా చకచక పనులు చక్కబెడుతోంది బీఆర్‌ఎస్‌. అయితే.. ఈ నెల 14న ఢిల్లీలో తాత్కాలిక బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. తాజాగా ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎంపీలు నామ నాగేశ్వరరావు , రాములు, దయాకర్ రావు, బడుగు లింగ యాదవ్, బీపీ పాటిల్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఈనెల 14 నుంచి అందుబాటులో ఉందన్నారు. అయితే.. తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందని, పక్కనున్న రాష్ట్రాలు కూడా తెలంగాణ అభివృద్ధిలా కోరుకుంటున్నారన్నారు.
Also Read :Varahi: పవన్ కళ్యాణ్ ‘వారాహి’కి లైన్‌క్లియర్.. అన్ని అనుమతులు ఉన్నాయని ఆర్టీఏ ప్రకటన

పార్లమెంట్‌లో పక్క రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కూడా చర్చించుకుంటున్నారని, కేంద్రంలో రైతు సంక్షేమ పార్టీ అధికారంలోకి రావాలన్నదే మా ధ్యేయమన్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని పనులు రాష్ట్రంలో చేశామని ఆయన వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పార్టీ స్థాపించామని, రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పార్టీ కార్యాలయం ఓపెనింగ్‌కి కొంతమంది జాతీయ నాయకులను ఆహ్వానించామని ఆయన తెలిపారు.