NTV Telugu Site icon

Itching Powder: మంత్రిపై దురద పౌడర్‌తో దాడి.. నిలిచిపోయిన రథయాత్ర, వీడియో వైరల్

Itching Powder

Itching Powder

Itching Powder on Minister: మధ్యప్రదేశ్ మంత్రి బ్రిజేంద్ర సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం దురద పౌడర్‌తో దాడి చేశారు. దీంతో మంత్రికి దురద ఎక్కువ కావడంతో బీజేపీ రథయాత్ర మధ్యలో నిలిచిపోయింది. భోపాల్‌లో భారతీయ జనతా పార్టీ రథయాత్రలో మంత్రి పాల్గొంటుండగా ఈ ఘటన జరిగింది మంత్రి నీళ్లతో కడుక్కుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మధ్యప్రదేశ్ మంత్రి బ్రిజేంద్ర సింగ్‌పై దురద పౌడర్ విసిరినట్లు తెలిసింది.

BBC Documentary On Modi: బీబీసీపై నిషేధానికి సుప్రీంకోర్టు తిరస్కరణ..

యాత్ర మధ్యలో మంత్రి తన కుర్తా తీసేసి కడుక్కుంటున్నట్లు ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన వీడియోలు ఉన్నాయి. అతని చుట్టూ ఉన్న కొందరు అతనికి నీళ్లతో సహాయం చేయడాన్ని చూడవచ్చు, మరికొందరు మొత్తం సంఘటనను కెమెరాలో చిత్రీకరించారు. ప్రజలతో మమేకమై వారికి ఉపయోగపడే ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించే లక్ష్యంతో మంత్రి ఉన్నారు. వికాస్ యాత్రలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఫిబ్రవరి 25 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి మంత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్త పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.ఈ ప్రచారంలో భాగంగా, ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, వివిధ పథకాల లబ్ధిదారులకు చేరవేయాలని ఆ పార్టీ యోచిస్తోంది.

 

Show comments