NTV Telugu Site icon

MP: పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 10 కి.మీ మేర వ్యాపించిన పొగలు

Fire Accident

Fire Accident

MP: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం ఏడు గంటలకు మంటలు చెలరేగగా, అప్పటి నుంచి అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పైపుల ఫ్యాక్టరీలో ప్రమాదం జరుగడంతో మంటల తీవ్రత ఎక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో పైపులను ఉంచడంతో వాటికి అంటుకుని మంటలు భీకర రూపం దాల్చాయి. 10 కిలోమీటర్ల దూరం వరకు పొగలు కనపడడాన్ని బట్టి మంటలు ఎంత భయంకరంగా ఉన్నాయో అంచనా వేయవచ్చు. 12కి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతోపాటు ఇసుక, నురగతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఫ్యాక్టరీలో ఉద్యోగులు లేరు
సిగ్నెట్ పీవీసీ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడి ఉద్యోగుల షిఫ్ట్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. దీంతో ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అందువల్ల ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేరు.

ఇసుకతో కూడా మంటలను ఆర్పే ప్రయత్నం
మూడు పోలీసు స్టేషన్ల పోలీసు బలగాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. ధార్, పితంపూర్, ఇండోర్, బద్నావర్ నుండి ఫైర్ ఇంజన్లను పిలిపించారు. కానీ, పెద్దఎత్తున మంటలను అదుపు చేయలేకపోయారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీకి చెందిన అగ్నిమాపక దళం కూడా మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉంది. అనంతరం ఇసుకతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం డంపర్ల నుంచి ఇసుకను తెప్పించారు.

Read Also:Chiranjeevi : చంద్రబాబు ప్రమాణ స్వీకారనికి మెగాస్టార్ కు ప్రత్యేక ఆహ్వానం..

పైపులు బయటకు తీస్తున్నారు
ఫ్యాక్టరీ లోపల ఉంచిన ప్లాస్టిక్ పైపులను వ్యవసాయానికి వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పైపులను బయటకు తీస్తున్నారు. దాని వల్ల మంటలు మరింత వ్యాపించకుండా జాగ్రత్త పడుతున్నారు.

స్పందించిన మంత్రి కైలాష్
మంత్రి కైలాష్ విజయవర్గియా ధార్ జిల్లాలోని పితాంపూర్‌లోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగిందని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఇండోర్ నుంచి ఐదు ఫోమ్‌లు నింపిన వాహనాలు, వాటర్ ట్యాంకర్లను పంపించారు. అవసరమైతే మరింత సహాయం అందిస్తామన్నారు. ప్రభుత్వం, పరిపాలన అలర్ట్ గా ఉన్నాయన్నారు.

Read Also:Balmoori Venkat: తప్పుడు ప్రచారాలు చేయకండి.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్..