Site icon NTV Telugu

MP Laxman: తెలంగాణ విముక్తి కై బీజేపీ పోరాటం

Laxman

Laxman

కేసీఆర్ అవినీతి, అప్రజాస్వామిక, నిజాం నియంతృత్వ పాలనపై తెలంగాణ ఉద్యమం స్థాయిలో మరో పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా మూడో దశ పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కు హటావో తెలంగాణ కో బచావో, బీజేపీకి జితావో నినాదంతో పోరాటాలు చేస్తామని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగిందితప్ప.. తెలంగాణ ప్రజలకి దక్కింది ఏమీ లేదు అని ఆయన వెల్లడించారు.

Read Also: Meher Ramesh: మెహర్ రమేష్ మహేష్ బాబు ఫ్రెండ్ గా నటించాడని మీకు తెలుసా?

బందుల పేరిట అన్ని బంద్ చేశారు.. బీజేపీ పోరాటానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సబ్బండ వర్గాలను ఆహ్వానిస్తున్నామని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కోరారు.కేసీఆర్ కబంధ హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్ర విముక్తి కై బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలు, అర్హులైన వారికే పథకాలు అందాలని ఉద్యమం చేస్తున్నట్లు బీజేపీ ఎంపీ పేర్కొన్నారు.

Read Also: Nora Fatehi : ఉప్పొంగే పరువాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..

ఆగస్ట్ 16న పల్లె బాట, బస్తీ బాటతో ప్రారంభమై.. ఆగస్ట్ 17 న బస్తీ డివిజన్ వారీగా ఆందోళనలు.. అసెంబ్లీ కేంద్రాల్లో రాస్తారోకో, దిగ్బంధనం, ముట్టడితో పాటు ఆగస్ట్ 23న అధికార పార్టీ ఎమ్మెల్యేల ఘెరావు.. ఆగస్ట్ 24న మంత్రుల ఘెరావ్.. ఆగస్ట్ 25న కలెక్టరేట్ల ముట్టడి.. మిలియన్ మార్చ్ తలపించే విధంగా సెప్టెంబర్ మొదటి వారం లో హైదరాబాద్ లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు సహాకరించాలని ఆయన కోరారు.

Exit mobile version