హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేశారు. మహిళా దినోత్సవ సంబరాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర సంస్థగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మహిళందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పూజించే గోవును కూడా గోమాత అంటారని అన్నారు. మహిళల సాధికారతపై ప్రాధాన్యత పెరగాలని చెప్పారు.
Read Also: Summer Tips : వేసవి లో ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు..
వికసిత భారత్ మోడీ లక్ష్యం.. అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చి దిద్దడమే మోడీ విజన్ అని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. భారత్ ఎదుగుదలలో మహిళలే కీలకం కావాలని అన్నారు. భారత్ ఆర్థిక అభివృద్ధిలో మహిళా అమ్మ పాత్ర పోసించాలన్నదే మోడీ ఆలోచన అని తెలిపారు. 64 కోట్ల మంది హిందువులు కుంభమేళాలో పాల్గొని.. కుహానా మేధావుల కళ్ళు తెరిపించి, సనాతన ధర్మం గురించి చాటి చెప్పారని వెల్లడించారు. సనాతన ధర్మానికి గొప్ప చరిత్ర ఉంది.. పాశ్చాత్య సంస్కృతి వల్ల మన సనాతన సాంప్రదాయాలను మర్చిపోతున్నామని వ్యాఖ్యానించారు. సనాతన సంప్రదాయాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళా మీద ఉందని లక్ష్మణ్ చెప్పారు.
Read Also: Rangareddy: సినిమా షూటింగ్ కోసం లొకేషన్ చూపిస్తుండగా కరెంట్ షాక్.. వ్యక్తి మృతి
మహిళా ఆర్థిక అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని లక్ష్మణ్ తెలిపారు. మహిళలు ఆర్థికంగా, ఆలోచనల పరంగా అభివృద్ధి కావాలి.. దేశానికి రాష్ట్రపతి, ఢిల్లీకి ముఖ్యమంత్రి మహిళేనని అన్నారు. మహిళా బిల్లుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో కల్లబొల్లి మాటలు చెప్పి రేవంత్ అధికారంలోకి వచ్చారు.. ఇచ్చిన హామీలన్నీ నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాక్ష్యం అని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి జరుగుతోంది.. తెలంగాణలో మహిళా శక్తితో బీజేపీ అధికారంలోకి రాబోతోంది.. రేవంత్ సర్కార్ ను కూకటి వేళ్ళతో పెకలించడానికి తెలంగాణలో మహిళా శక్తి సిద్ధం కావాలని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.