Site icon NTV Telugu

BJP MP Laxman: రాజగోపాల్ రెడ్డికి బీజేపీ జాతీయస్థాయిలో మంచి హోదాని కల్పించింది..

Laxman

Laxman

భారతీయ జనతా పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంపై బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డికి పార్టీ జాతీయస్థాయిలో మంచి హోదాని కల్పించింది.. పార్టీ కార్యకర్తల కృషి, శ్రమతో మా కార్యకర్తలు రక్తాన్ని చిందిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. అటువంటి బిజెపిపై ఇష్టానుసారంగా మాట్లాడడం సరైనది కాదు.. జాతీయ స్థాయి నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరి.. ఇలాంటి నిందలు వేయడం సరైంది కాదు అని తెలిపారు.

Read Also: Sandra Venkata Veeraiah: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి.. కర్ణాటకలో ఉన్న వాళ్ళు మోసపోయారు..

బీజేపీ పార్టీ రాజగోపాల్ రెడ్డిని గౌరవించి ఉన్నతమైన స్థానం కల్పించింది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. వ్యక్తిగతంగా ఇటువంటి ఆరోపణలు చేయటం సరైనది కాదు.. కచ్చితంగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు.. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోంది అంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఇదంతా చూస్తున్నారు అని లక్ష్మణ్ అన్నారు. అయితే, పవన్ కళ్యాణ్-కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన- బీజేపీ మైత్రితో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. జాతీయ పార్టీగా బీజేపీ జాతీయ భావాన్ని పెంపొందిస్తుంది కానీ కొన్ని పార్టీలు విభజిస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనే నమ్మకం మాకు ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసిన మరోసారి బీజేపీనే అధికారంలోకి వచ్చేది అంటూ లక్ష్మణ్ పేర్కొన్నారు.

Exit mobile version