NTV Telugu Site icon

BJP MP Laxman: కాంగ్రెస్ స్క్రిప్టును తండ్రీకొడుకులు చదివారు

Mp Laxman

Mp Laxman

BJP MP Laxman: శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ వేదికగా మార్చుకున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాని మోడీని, కేంద్రాన్ని టార్గెట్ చేసి.. శాసనసభ వేదికగా విమర్శలు చేశారని ఆయన అన్నారు. తండ్రీ కొడుకు అల్లుడు పోటీపడి మరీ మోడీని విమర్శించారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‭లు వేరు కాదన్న ఆయన.. కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్టును తండ్రీ, కొడుకులు చదివారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేయాలి.. ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే దానిపై చర్చించకుండా.. బీజేపీని విమర్శించడానికే సమయాన్ని వృధా చేశారని మండిపడ్డారు.

Read Also: Video call delivery : త్రీ ఇడియట్స్ సీన్ రిపీట్.. అది రీల్.. ఇది రియల్

తమ వైఫల్యాలు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు. అసలు సెక్రటేరియట్‭కు రాని ముఖ్యమంత్రికి సెక్రటేరియట్ అవసరమా అని నిలదీశారు. గతంలో కేంద్రమంత్రిగా కేసీఆర్ ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చర్చించే ధైర్యం కేసీఆర్‭కు లేదన్నారు. కరోనా సమయంలో పొరుగుదేశాలు ఆర్థికంగా చితికిపోతే.. భారత్‭లో ప్రధాని మోడీ ఆర్థిక సంక్షోభం లేకుండా చేశారని ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సభలో చర్చించే ధైర్యం చేయలేదన్నారు లక్ష్మణ్… అలా చేస్తే గుట్టురట్టు అవుతుందని కాగ్ రిపోర్ట్ కూడా పెట్టలేదని ఆయన ఆరోపించారు.

Show comments