NTV Telugu Site icon

Kesineni Nani: టీడీపీకి వచ్చేవి 54 సీట్లే..! తేల్చేసిన కేశినేని నాని..

Kesineni Nani

Kesineni Nani

Kesineni Nani: టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమై.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన జాబితాలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బెర్త్‌ దక్కించుకున్న.. ఎంపీ కేశినేని నాని.. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. విజయవాడ ద్రోహి చంద్రబాబు.. పొరపాటున కూడా గెలవడు అని జోస్యం చెప్పారు.. విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా బయటపెట్టారు.. టీడీపీకి 54 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. ఇక, ఆసియాలోనే అతిపెద్ద ఆటోనగర్ ఇది.. నా ఆటోనగర్.. నాకు ఎంతో ఇష్టమైన ప్రాంతం.. వాటర్ ట్యాంకుకు ఎంపీ లాడ్స్ నిధులతో పాటు, ఐలా నుంచీ అవినాష్ సహకారంతో నిధులు వచ్చాయి.. సమర్ధత కలిగిన వ్యక్తి అవినాష్, నేను కూడా సమర్ధుడినే.. నన్ను, అవినాష్ ని గెలిపించాలి.. మేం ఇద్దరం కలిస్తే డబుల్ రీటైనింగ్ వాల్ వస్తుందన్నారు. సమర్ధులకు ఓటేయండి… జగన్ ని, నన్ను, అవినాష్ ని గెలిపించండి అని పిలుపునిచ్చారు కేశినేని నాని. తూర్పు నియోజకవర్గం కనుక ఇంత క్లారిటీతో చెపుతున్నాను అన్నారు.

Read Also: Trending News : నా వయసు 112ఏళ్లే… నాకు మొగుడు కావాలి.. కానీ నాదో కండీషన్..

ఇక, వైసీపీ అభ్యర్ధుల లిస్టులో ఎంపీ అభ్యర్ధిగా అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు కేశినేని నాని.. నన్ను టీడీపీ మెడపట్టుకుని అవమానకరంగా గెంటేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, నన్ను అక్కున చేర్చుకుని సీటిచ్చారు వైఎస్‌ జగన్ అని కొనియాడారు. లోకేష్‌ సీఎం అవ్వడమే చంద్రబాబు లక్ష్యం అని పేర్కొన్న ఆయన.. చంద్రబాబు విజయవాడని స్మశానం చేయాలని కంకణం కట్టుకున్నాడని.. విజయవాడను మరో ఓల్డ్ సిటీ చేయాలని చంద్రబాబు ఆలోచన.. విజయవాడకు ఎయిర్ పోర్ట్‌ కూడా ఉండకూడదని చంద్రబాబు ఆలోచించారని సంచలన ఆరోపణలు చేశారు.

Read Also: MLA Eliza : పార్టీ నన్ను మోసం చేసింది.. పెత్తందార్ల కోసం..! వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మరోవైపు.. అమరావతి రాజధానికి నేను వ్యతిరేకం కాదు అన్నారు కేశినేని నాని.. కాజ నుంచి కట్టి ఉంటే బ్రహ్మాండమైన నగరం అయ్యేది.. కానీ, రైతుల భూములు తీసుకుని మోసం చేశారని విమర్శించారు. ల్యాండు మాఫియాకి వెళ్లకుండా పాత అమరావతి నుంచి ప్లానింగ్ ఇస్తే బాగుండేది.. అమరావతి ప్రాజెక్టు 30 ఏళ్లయినా పూర్తవదు అని అప్పుడే చెప్పానని గుర్తుచేశారు. భూమాఫియా చేతుల్లోకి వెళ్లి.. బాబు కోడుకులిద్దరూ రైతులను మోసం చేశారని విరుచుకుపడ్డారు.. రాజధాని ఇక్కడ రావడానికి వ్యతిరేకం కాదు.. కానీ, అమరావతి రాజధాని అంశంతో మోసం చేశారని విమర్శించారు. విజయవాడ ద్రోహి చంద్రబాబు.. పొరపాటున కూడా చంద్రబాబు గెలవడన్నారు. అంతేకాదు.. లోకేష్ కోసం పవన్‌ కల్యాణ్‌ను కూడా చంద్రబాబు మోసం చేస్తాడని ఆరోపించారు ఎంపీ కేశినేని నాని..