Site icon NTV Telugu

Kesineni Nani: చంద్రబాబు, ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం.. ఈ కార్యక్రమం నా అదృష్టం

Mp Kesineni Nani

Mp Kesineni Nani

Kesineni Nani: ఏ ఎంపీ చేయనటువంటి కార్యక్రమం చేయడం నా అదృష్టం.. చంద్రబాబు, ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తాం అన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.. విజయవాడలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిచౌంగ్‌ తుఫాన్‌ రాష్ట్ర రైతాంగాన్ని అతలాకుతలం చేసింది.. అన్ని పంటలు, పూత మీద మామిడి కూడా దెబ్బ తిందని.. కొన్ని లక్షల ఎకరాల్లో పంట దెబ్బ తింది.. వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఎకరానికి రూ.40 వేల నుంచి 50 వేల ఎకరాలు నష్టపోయారు.. రైతులను ఆదుకోవడంలో వైఎస్‌ జగన్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. హుద్ హుద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు అక్కడే ఉండి ప్రజలకు ధైర్యం ఇచ్చారు.. కానీ, ఈ రోజు చాలా నిర్లక్ష్యంగా రైతులను గాలికొదిలేసిందని.. ఇటువంటి ప్రభుత్వం ఉండడానికి వీల్లేదన్నారు కేశినేని.

Read Also: Success Story: వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు.. ఎవరీ ‘నిషా జగ్తియాని’?

కేంద్రంలో ఆదుకోమని టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో డిమాండ్ చేశారు.. ముందుగా 5 వేల కోట్లు విడుదల చేయాలని టీడీపీ ఎంపీలు కోరారు.. కేంద్ర మంత్రిని రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరామని తెలిపారు కేశినేని నాని.. రైతులను ఆదుకుంటామని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మా ప్రయత్నాలు మేం చేసి రైతులను ఆదుకుంటాం అన్నారు. ఇక, విజయవాడ శివారులో తాగు నీటి సమస్య ఉంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో ప్రతి గ్రామానికి నీటి ట్యాంకర్ల పంపిణీ చేశామని.. ఇప్పటిదాకా 120 న్యూటి ట్యాంకర్ల ఇచ్చాం.. ఇంకా నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ఇస్తాం.. 13 కోట్లు తాగు నీటి సమస్య పరిష్కారానికి ఖర్చు చేస్తున్నాం.. ఏ ఎంపీ చేయనటువంటి కార్యక్రమం చేయడం.. నా అదృష్టంగా భావిస్తున్నాను.. చంద్రబాబు, ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని.

Exit mobile version