NTV Telugu Site icon

MP Kesineni Nani: త్వరలో టీడీపీకి రాజీనామా.. టార్గెట్ చేరడానికి మా వాళ్లు ఏం చెబితే అదే చేస్తా..

Mp Kesineni Nani

Mp Kesineni Nani

MP Kesineni Nani: త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు తెలిపారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి త్వరలో రాజీనామా చేస్తున్నాను అన్నారు. లోక సభ స్పీకర్ అనుమతి కోరాను.. స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని వెల్లించారు. ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు కేశినేని నాని.

Read Also: Balineni Srinivasa Reddy: రాజకీయాల్లో ఉన్నంత వరకూ సీఎం జగన్‌తోనే.. టీడీపీతో టచ్‌లో లేను..!

ఇక, టార్గెట్ చేరడానికి మా వాళ్లు ఏం చెయ్యమంటే అదే చేస్తాను అన్నారు కేశినేని.. ఇందులో నా సొంత నిర్ణయం ఉండదు.. నేను ఏం చేసినా పారదర్శకంగా చేస్తాను.. ఏ నిర్ణయం తీసుకున్నా తెల్లవారు జామున సోషల్‌ మీడియా పోస్ట్‌ లో పెడతానన్నారు. నేను పెట్టే పోస్టులను మీడియా ఫాలో అవ్వటమే.. కానీ, రోజూ ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పలేను అన్నారు. రాజకీయ నేతగా, విజయవాడ ఎంపీగా సుదీర్ఘకాలంగా ఇక్కడ ప్రజల కోసం, ప్రాంతం కోసం పనిచేశాను.. ప్రజలను, నాతో ఉన్నవాళ్లను వదిలేసి నిర్ణయాలు తీసుకోలేను.. వారితో చర్చించిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు ఎంపీ కేశినేని నాని.

Read Also: Viral News: రూ.4 లక్షలను మింగేసిన పెంపుడు కుక్క.. చివరకు అలా తీసి..

కాగా, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని త్వరలోనే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు.. తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన విషయం విదితమే.. త్వరలో లోక్ సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని కేశినేని ట్వీట్ చేశారు.. నా అవసరం లేదని చంద్రబాబు భావించారు. ఇంకా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ”చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన.. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను” అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.. ఇక, తన ట్వీట్‌కు చంద్రబాబు, భువనేశ్వరిలతో కలిసి తాను ఉన్న ఫొటోను షేర్‌ చేశారు కేశినేని నాని.