నాగోల్ బీజేపీ ఓబీసీ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ నాయకత్వంలోని బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుతోందన్నారు. బీసీల మద్దతుతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తోందని స్పష్టమైందని ఆయన వ్యాఖ్యానించారు. బీసీలకు పెద్ద పీఠ వేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దే అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. బీసీల రిజర్వేషన్లను కుదించిన చరిత్ర సీఎం కేసీఆర్‌దే అని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల ద్రోహి అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఓవైసీ సోదరులకు కొమ్ము కాస్తోందని, బీసీల సీట్లను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ ముస్లింలకు అవకాశం ఇచ్చారని ఆయన మండిపడ్డారు.
Also Read : Free Flight Tickets : రూపాయి ఖర్చు లేకుండా విమానంలో ప్రయాణించవచ్చు.. మీకు తెలుసా..!
బీసీలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలదని, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ జనగణన ఎందకు చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కోరల్లేని బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించి అన్ని అధికారాలు అప్పగిస్తామని పేర్కొంది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే బీసీ విద్యార్థులందరికీ పరిమితి లేకుండా స్టాచ్చురేషన్ పద్దతిలో అందరికీ ఆర్దిక సాయం అందిస్తామని, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేస్తామని, ఎన్నికల్లో పోటీపడలేని, గెలవలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేస్తామని ఆయన అన్నారు.
Also Read : Karnataka Politics: కర్ణాటక సీఎంగా సిద్దరామయ్యే ఎందుకు..? డీకే ఎలా పట్టు నిలుపుకోనున్నారు..?