500 ఏండ్ల సుదీర్ఘ పోరాటాలతో అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం జరిగిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. రాముడు జన్మించిన పుణ్యభూమిలో రామమందిరం నిర్మించాలని ప్రపంచంలోని సనాతన ధర్మీయులు ఎన్నో కలలుగన్నారని… ముఖ్యంగా భవ్య మందిర నిర్మాణంలో కరసేవకుల పాత్ర కీలకమని, వారి త్యాగం చిరమస్మరణీయమని కొనియాడారు. ఎంతోమంది వారి జీవితాలను త్యజించి, కుటుంబాలను వదులుకొని సుదీర్ఘ పోరాటం చేశారని తెలిపారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను నరేంద్ర మోడీ ప్రభుత్వం నెరవేర్చిందని డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. అయితే సనాతన ధర్మాన్ని నాశనం చేయడమే కొన్ని రాజకీయ పార్టీలు పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. ధర్మాన్ని నాశనం చేయాలనుకునేవారు.. చివరికి వారే నాశనమవ్వక తప్పదని హెచ్చరించారు. భాగ్యనగర్ శివాజీ సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముద్రించిన ఛత్రపతి శివాజీ సేవా పురస్కార్ పుస్తకాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజలందరికీ రామనామ సంవత్సర శుభాకాంక్షలు. భాగ్యనగర్ శివాజీ సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ సేవా పురస్కార్ పుస్తకాన్ని ముద్రించింనందుకు అభినందనలు తెలిపారు. 500 ఏండ్ల సుదీర్ఘ పోరాటాలతో అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం జరిగిందన్నారు. రాముడు జన్మించిన పుణ్యభూమిలో రామమందిరం నిర్మించాలని ప్రపంచంలోని సనాతన ధర్మీయులు ఎన్నో కలలుగన్నారని ఆయన తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంలో కరసేవకులు చూపిన చొరవ స్ఫూర్తిదాయకమని, కరసేవలో పాల్గొన్న కరసేవకులు అందరికీ పాదాభివంనాలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. బాబర్ భారతదేశం మీద దాడి చేసి విధ్వంసం సృష్టించి అయోధ్యలోని రామమందిరంపై దాడి చేసి వివాదస్పద కట్టడాన్ని(మసీదు)ను నిర్మించాడన్నారు.
అంతేకాకుండా.. ‘ఆనాడు విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు సాధుసంతులు, దైవ భక్తులు, దేశభక్తులు సుదీర్ఘపోరాటం చేశారు. వీహెచ్‌పీ తలపెట్టిన కార్యక్రమానికి బీజేపీ మద్దతిస్తూ తీర్మానం ప్రకటించింది. గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి అయోధ్యకు పాదయాత్ర చేయాలని ఎల్‌కే అద్వానీ గారు సంకల్పించారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ, నిద్రమత్తులో తూగుతున్న శాసనకర్తలకు బుద్ధివచ్చేలా అధ్వానీ గారు గుజరాత్ నుంచి సోమనాథ్ రథయాత్ర ప్రారంభించారు. రథయాత్ర ద్వారా అధ్వానీ గారు దేశంలోని హిందువుల్లో చైతన్యం నింపారు.
కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం ముసుగులో హిందువుల మనోభావాలను కించపర్చడం, ఆలోచనలను వ్యతిరేకిస్తూ మోసం చేస్తూ వచ్చింది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణంలో పాత్ర పోషించిన రాజేంద్రస్రాద్ గారు ఆలయ ప్రారంభోత్సవానికి నాటి ప్రధాని నెహ్రూ గారిని ఆహ్వానిస్తే తిరస్కరించారు. సోమనాథ్ దేవాలయ ప్రారంభోతద్సవంలో తాము భాగస్వామ్యం కామని నాడు కాంగ్రెస్ తేల్చిచెప్పింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం అనేకమంది కరసేవకులు, హిందువులు పోరాటం చేసి ప్రాణత్యాగం చేశారు. మతోన్మాద రక్కసిమూకల చేతిలో వేలాది మంది సాధుసంతులు, హిందువులు, కరసేవకులు బలిదానమయ్యారు. నరేంద్ర మోడీ కారణజన్ముడిగా ప్రధానిగా అయినప్పటి నుంచి దేశంలోని అనేక సమస్యలకు పరిష్కారమార్గం చూపారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా యూపీ ప్రభుత్వం సహాయంతో అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిరం నిర్మాణం సాకారం చేశారు. సోమనాథ్ మందిరం, కాశీ విశ్వనాథ్ ఆలయంతో పాటు దేశంలో అనేక పవిత్ర క్షేత్రాలకు పూర్వవైభవం సంతరించుకుంది. పేదల సంక్షేమం కోసం కులమతాలకు అతీతంగా నరేంద్ర మోదీ గారు సుపరిపాలన అందిస్తున్నారు. దేశంలో ప్రధాని మోదీ గారి సుపరిపాలన చూసి ఓర్చుకోలేక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. నాడు ఎంతోమంది ఉద్యమకారుల రక్తతర్పణతో విలవిలలాడి సరయూనది అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్టతో నేడు దీపాలతో పవిత్రమైంది. కోట్లాది మంది ప్రజల ప్రతినిధిగా అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని రాజకీయాలకు ముడిపెడుతూ వస్తోంది. బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన రోజున తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఎక్కడా ప్రత్యేక పూజలు నిర్వహించకూడదంటూ హుకుం జారీ చేసి దుర్మార్గంగా వ్యవహరించింది. ఆంగ్లేయులు మొదలు మొఘలాయిలు, ఔరంగజేబు, మీర్ బాకీలు సనాతన ధర్మం వినాశనం కోసం ప్రయత్నించారు. చివరికి వారే నాశనమయ్యారు. ధర్మాన్ని వినాశనం చేయాలని కోరుకువారు చివరికి వారే నాశనమవుతారు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
