MP K.Laxman : ఈ పది సంవత్సరాల్లో దళారీ వ్యవస్థ లేకుండా చేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలు ఎంపీగా ఉంది ఇక్కడి ప్రజలకు బీబీ పాటిల్ సేవలు అందించారన్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ స్వేచ్ఛ ఇవ్వకపోయినా పని చేసిన వ్యక్తి బీబీ పాటిల్ అని ఆయన అన్నారు. ఇప్పుడు బీజేపీలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ సేవలు చేయడానికి అవకాశం ఉంటుందని, ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ సంకల్ప పత్రం విడుదల చేశారన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నమో అందులో చెప్పారన్నారు. గత పది సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను బిజెపి ప్రభుత్వం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’ముస్లిం మహిళలకు భారంగా మారిన ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసింది కూడా మోది ప్రభుత్వమే.. వందల ఏళ్ల హిందువుల కల అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు.. ఇప్పుడు అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లో సంచల నిర్ణయాలు తీసుకోబోతున్నాము.. ఈ పది సంవత్సరాల్లో దళారీ వ్యవస్థ లేకుండా చేశాడు.. నేరుగా లబ్ధి దారుల ఖాతాలో నగదు జమ చేసిన ఘనత మోడీది.. గతంలో డబుల్ బెడ్రూం పేరుతో కెసిఆర్ ఓట్లు దండుకుని మోసం చేశాడు.. ఉత్తర్ ప్రదేశ్ లో యోగి అధిత్తనాథ్ పేద ప్రజలకు 60 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చాడు.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్ తో పాటు అదనంగా యోగి రెండు కిలోల బియ్యం అందిస్తున్నాడు.. ఉత్తర్ ప్రదేశ్ లో మాఫియా, రౌడియిజం పై ఉక్కు పాదం మోపింది బిజెపి ప్రభుత్వం.. ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధి చూసిన తెలంగాణ ప్రజలు ఇక్కడ కూడా బిజెపి ప్రభుత్వం కోరుకుంటున్నారు.. దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లు కట్టించిన ఘనత ప్రధాని మోడీ.. గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకపోతే ఓట్లు కూడా అడగను అన్నాడు.. ప్రజను మభ్య పెట్టీ కెసిఆర్ మోసం చేశాడు.. మాటల మాంత్రికుడు..మాయల ఫకీరు కేసీఆర్.. మాట తప్పితే తల నరుక్కుంటా అన్నాడు కేసీఆర్.. కేసీఆర్ తప్పిన మాటలకు ఎన్ని సార్లు తల నరుక్కోవాల్సివస్తుందో ఆలోచించండి..’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!