NTV Telugu Site icon

MP K.Laxman : ఈ పది సంవత్సరాల్లో దళారీ వ్యవస్థ లేకుండా చేశాం

Laxman

Laxman

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్‌నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలు ఎంపీగా ఉంది ఇక్కడి ప్రజలకు బీబీ పాటిల్ సేవలు అందించారన్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ స్వేచ్ఛ ఇవ్వకపోయినా పని చేసిన వ్యక్తి బీబీ పాటిల్ అని ఆయన అన్నారు. ఇప్పుడు బీజేపీలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ సేవలు చేయడానికి అవకాశం ఉంటుందని, ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ సంకల్ప పత్రం విడుదల చేశారన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నమో అందులో చెప్పారన్నారు. గత పది సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను బిజెపి ప్రభుత్వం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా..’ముస్లిం మహిళలకు భారంగా మారిన ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసింది కూడా మోది ప్రభుత్వమే.. వందల ఏళ్ల హిందువుల కల అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు.. ఇప్పుడు అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లో సంచల నిర్ణయాలు తీసుకోబోతున్నాము.. ఈ పది సంవత్సరాల్లో దళారీ వ్యవస్థ లేకుండా చేశాడు.. నేరుగా లబ్ధి దారుల ఖాతాలో నగదు జమ చేసిన ఘనత మోడీది.. గతంలో డబుల్ బెడ్రూం పేరుతో కెసిఆర్ ఓట్లు దండుకుని మోసం చేశాడు.. ఉత్తర్ ప్రదేశ్ లో యోగి అధిత్తనాథ్ పేద ప్రజలకు 60 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చాడు.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్ తో పాటు అదనంగా యోగి రెండు కిలోల బియ్యం అందిస్తున్నాడు.. ఉత్తర్ ప్రదేశ్ లో మాఫియా, రౌడియిజం పై ఉక్కు పాదం మోపింది బిజెపి ప్రభుత్వం.. ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధి చూసిన తెలంగాణ ప్రజలు ఇక్కడ కూడా బిజెపి ప్రభుత్వం కోరుకుంటున్నారు.. దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లు కట్టించిన ఘనత ప్రధాని మోడీ.. గతంలో కేసీఆర్‌ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకపోతే ఓట్లు కూడా అడగను అన్నాడు.. ప్రజను మభ్య పెట్టీ కెసిఆర్ మోసం చేశాడు.. మాటల మాంత్రికుడు..మాయల ఫకీరు కేసీఆర్‌.. మాట తప్పితే తల నరుక్కుంటా అన్నాడు కేసీఆర్‌.. కేసీఆర్‌ తప్పిన మాటలకు ఎన్ని సార్లు తల నరుక్కోవాల్సివస్తుందో ఆలోచించండి..’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Show comments