NTV Telugu Site icon

MP K. Laxman : రాహుల్ గాంధీ ఇంకా ఎన్నికల హ్యాంగోవర్ నుండి బయట పడలేదు

K Laxman

K Laxman

రాహుల్ గాంధీ ఇంకా ఎన్నికల హ్యాంగోవర్ నుండి బయట పడలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా పర్యటనలో దేశం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల అవమాన పరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రధాని కాలేదన్న బాధతో మోడీ మీద అక్కసు తో దేశం మీద విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీ రిజర్వేషన్ లు రద్దు చేస్తామని అసలు రంగు బయట పెట్టారన్నారు ఎంపీ లక్ష్మణ్‌. రిజర్వేషన్ లు పొందు పర్చిన అంబేద్కర్ ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని, సామాజిక పరమైన రిజర్వేషన్ లని నెహ్రూ, రాజీవ్ గాంధీ వ్యతిరేకించారన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అదే మాట మాట్లాడారని, బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్ లు రద్దు కావని అమిత్ షా స్పష్టం చేశారని, భారత వ్యతిరేకి అయిన సెనెటర్ ను రాహుల్ గాంధీ కలిశారన్నారు ఎంపీ లక్ష్మణ్‌.

 
Gambling: జూదంలో భార్యని పణంగా పెట్టిన భర్త.. స్నేహితుల లైంగిక వేధింపులు..

Show comments