విభజన చట్టానికి అనుగుణంగా సూపర్ పవర్ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేశారని, RTI ద్వారా NTPC తాజా సమాచారం ప్రకారం తెలంగాణ కు NTPC నాలుగు సార్లు లేఖ రాసిందన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బీఅర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందన్నారు. తక్కువ ఖర్చుతో వచ్చే పవర్ ను కాదని కమిషన్ల కోసం వేరొక చోట కొన్నారన్నారు. ఈ విషయాన్ని గతంలో కాంగ్రెస్ కూడా ఆరోపించిందని, ఇప్పుడు అధికారంలో కి వచ్చాక కాంగ్రెస్ కూడా NTPCతో ఒప్పందం కుదుర్చుకోవడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా NTPC రెండు సార్లు లేఖ రాసిందని ఆయన పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని, ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే వేరొక రాష్ట్రానికి మళ్లిస్తామని ntpc హెచ్చరిస్తుందన్నారు.
అంతేకాకుండా.. ‘కానీ కాంగ్రెస్ స్పందించక పోవడం చూస్తే గత బి అర్ ఎస్ లాగే కాంగ్రెస్ కూడా కమిషన్ల కోసం వేరొక చోట కొనలనుకుంటుందా..? మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పవర్ లో 80 శాతం మన రాష్ట్రానికి ఇవ్వడానికి ntpc సిద్ధంగా ఉంది.. వంద రోజులు ముఖ్యమంత్రి గా రోజుకు 18 గంటలు పని చేశాను అని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు.. ఇప్పుడు ఎన్నికల వేల పిసీసీ చీఫ్ అవతారం ఏత్తుతా అని మాట్లాడుతున్నాడు.. రేవంత్ నువ్వు గేట్లు ఎత్తి రాజకీయాలు చేస్తే.. కరెంటు సంగతి ఎవరు చూడాలి..? పగలు కరెంట్ లేక రాత్రి మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి ఓ రైతు పాముకాటుకు బలయ్యాడు.. వేసవి ఇప్పుడే మొదలైంది.. అప్పుడే కరెంటు కోతలు స్టార్ట్ చేసారు.. ఛత్తీస్ ఘడ్ తో ఒప్పందం కుదుర్చుకుని బి అర్ ఎస్ రాష్ట్రానికి ఆర్థిక భారం పెంచింది.. కాంగ్రెస్ కూడా అదే దారిలో వెళ్తుందా..
మొన్న అసెంబ్లీ లో స్వయంగా అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ అవినీతి నీ వెలికి తీసి చర్యలు తీసుకుంటా అన్నారు.. కానీ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు.. భూ మాఫియా ను వెలికి తీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటా అన్నాడు.. మరి ఇప్పుడు స్పందించకపోవడం చూస్తే వారితి చేతులు కల్పడనికి సిద్ధం అయ్యారా.. రాహుల్ గాంధీ కి న్యాయ స్థానాల పై నమ్మకం లేదు.. కోర్టుల పై కూడా నమ్మకం లేదు.. కేవలం దేశాన్ని తిట్టడానికి రాహుల్ గాంధీ పని చేస్తున్నాడు.. దేశంలో ఉంటూ దేశానికి డెమోక్రసీ లేదని మాట్లాడుతాడు.. నిజంగా తప్పు చేయకపోతే కేజ్రివాల్ ఎందుకు విచారణకు హాజరు కాలేదు.. తొమ్మిది సార్లు ఈ డీ నోటీసులు ఇచ్చిన కూడా ఒక్క సారి కూడా కేజ్రివాల్ స్పందించలేదు.. అన్ని ఆధారాలు ఉండే ఈడీ కేజ్రీవాల్ నీ అరెస్ట్ చేసింది..’ అని ఆయన అన్నారు.
