NTV Telugu Site icon

MP K.Laxman : పోలింగ్ శాతం కూడా మాకు సానుకూలం అనే భావిస్తున్నాం

Laxman

Laxman

అన్ని పార్టీల కన్నా ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందని, మోడీ నీ గెలిపించాలని పట్టుదలతో పార్టీలను కాదని మోడీ వైపు మొగ్గుచూపారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ శాతం కూడా మాకు సానుకూలం అనే భావిస్తున్నామని, రెండు సార్లు అధికారం లో ఉన్న మోడీ పై వ్యతిరేకత కాకుండా సానుకూలత పెరిగిందన్నారు. దేశాన్ని అభివృద్ధి లో ముందుకు తీసుకువెళ్లే సత్తా ఆయనకు ఉందని ప్రజలు విశ్వసించారని, ఓట్లకోసం ఉచితాలు అయన ఇవ్వదని ప్రజలు భావించారన్నారు ఎంపీ లక్ష్మణ్‌. కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా దక్కదని, రేవంత్ రెడ్డి నేల విడిచి సాము చేసిన… ఉచితాల్ని , గ్యారంటీ లను ప్రజలు నమ్మలేదు….అలవి గానీ హామీలు ఇచ్చారన్నారు. అప్పు చేస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పెను సంక్షోభం లోకి నెట్టబోతుందని, BRS చచ్చిన పాము… కారు గారేజ్ నుండి వచ్చే అవకాశం లేదన్నారు లక్ష్మణ్‌.

అంతేకాకుండా..’కార్ ను స్క్రాప్ లో కూడా అమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ లో బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీ గా ఎదగబోతుంది… భవిష్యత్ లో brs కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయం. అధికార దాహం కోసం గతం లో కెసిఆర్ కాంగ్రెస్ లో చేరలేదు. అవినీతి పరులు ఏకం అయ్యి ఇండి కూటమి కట్టారు. రుణమాఫీ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి కి ఆగస్టు సంక్షోభం తప్పదు అని ప్రజలు అనుకుంటున్నారు. ఫేక్ వీడియో లు తయారు చేసి రేవంత్ రెడ్డీ ఫేక్ సీఎం గా పేరు తెచ్చుకున్నరు. రిజర్వేషన్ ల పై కాంగ్రెస్ అసలు స్వరూపం ప్రజలకు తెలుసు కాబట్టే ఆ పార్టీ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు. రేవంత్ రెడ్డి అతి ఉత్సాహం తో హామీలు గ్యారంటీ లు ఇచ్చారు… ప్రజలు తిరగపడతారు. .వారి పార్టీ నుండే ఆయనకు వ్యతిరేకత వస్తుంది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ తగ్గడానికి కారణం సీఎం మీద విశ్వాసం లేకపోవడమే. కేంద్రం 16 వేలు కోట్లు ఇవ్వకపోతే ఈ 5 యేళ్లు గడిచేది కాదు. పార్టీ కి సహకరించిన అందరికీ బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తరపున ధన్యవాదాలు’ అని లక్ష్మణ్‌ అన్నారు.