Site icon NTV Telugu

Newly Couple: మండే ఎండలో బైక్‌పై వెళ్తున్న కొత్త పెళ్లి జంట.. అది చూసిన ఎమ్మెల్యే..

Mla Lift

Mla Lift

మండుటెండలో నూతన వధూవరులు బైక్ పై ప్రయాణిస్తున్నారు. ఆ విషయాన్నీ గమనించిన ఓ ఎమ్మెల్యే తన కారులో నూతన వధూవరులను ఎక్కించుకుని వారికీ లిఫ్ట్ ఇచ్చాడు. వధువును తన సోదరిగా భావించిన ఆయన ఆ జంటను స్వయంగా వారి ఇంటి వద్ద దింపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ లోని రాజ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్., తన తండ్రి దిగ్విజయ్ సింగ్ ఎన్నికల ప్రచారం కోసం బిజీగా ఉన్నారు. బుధవారం ఎన్నికల ర్యాలీకి హాజరైన జైవర్ధన్ సింగ్ కారులో తిరుగు ప్రయాణమయ్యారు.

Also Read: Adhir Ranjan Chowdhury: తృణమూల్‌ కన్నా బీజేపీకి ఓటేయడమే బెటర్.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..

ఈ ప్రయాణంలో మండుటెండలో బైక్‌ పై వెళ్తున్న ఓ నూతన వధూవరులను ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ గుర్తించారు. వెంటనే ఆయన కారు ఆపాలని డ్రైవ ర్‌ను ఆదేశించారు. ఆ జంటను తన కారులో ఎక్కించమని ఎమ్మెల్యే కోరాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే వధువును తన సోదరి అని పిలిచాడు. దాంతోపాటు ఆమెకు ఎటువంటి అసౌకర్యం కలిగించవద్దని వరుడిని ఎమ్మెల్యే అన్నాడు.

Also Read: Michael Vaughan: టీ20 ప్రపంచ కప్లో సెమీ ఫైనల్ వెళ్లే జట్లు ఇవే.. టీమిండియాకు నో ఛాన్స్..!

మరోవైపు ఎండలో ఆలయ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న నవ దంపతులు బైక్ దిగి ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ కారు వెనుక సీటుపై కూర్చున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే తన కారులో నవ దంపతులు వారి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం స్వయంగా కారు డోర్ తెరిచి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఖరీదైన ఫార్చ్యూనర్ కారులో నుంచి వధూవరులు దిగడం చూసి ఆమె కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ప్రస్తుతం ఈ గంటానాకి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version