NTV Telugu Site icon

Bankers Conclave: రైతులకు బ్యాంకర్లు సహకరించాలి

mp apcob

Collage Maker 28 Jan 2023 03.29 Pm

ఆప్కాబ్ ఆధ్వర్యంలో బ్యాంకర్స్ కాంక్లేవ్ విజయవాడలో జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వరరావు, నాబార్డు ఛైర్మన్ కె.వి.షాజీ పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపీ బాలశౌరి, సహకార శాఖ అధికారులు, పలు సహకార బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు ప్రాధమికంగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. సహకార విధానం పురోగతి సాధించడానికి మేం కృషి చేస్తున్నాం. కేంద్రం ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలను డిజిటైజ్ చేయనుంది.జ సహకార రంగంలో 8.6 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.

Read Also: KTR: తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్‌తో మొట్ట మొదట నడిచింది నిజామాబాద్ జిల్లా

ఆక్వా కల్చర్‌ లో ఏపీ దేశంలోనే ప్రధమ స్ధానంలో ఉందన్నారు. 7, 600 ఆప్కాబ్ బ్రాంచ్ లు ఏపీలో ఉన్నాయి. 1.82 లక్షల కోట్లు డీబీటీ విధానంలో సంక్షేమ పథకాలు అందించింది. బ్యాంకర్ల సహకారంతోనే ఈ స్థాయిలో పధకాలు చేయగలుగుతున్నాం. సహకార రంగానికి ప్రధాని మోదీ ప్రత్యేక శాఖని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు ఎంపీ బాలశౌరి. దేశంలోనే రెండవ అతిపెద్ద తీర ప్రాంతమున్న ప్రాంతం ఏపీ అన్నారు. ఏపీలో రైతాంగానికి 18.4 లక్షల‌ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు. బ్యాంకర్లు రైతులకు చేయూత ఇవ్వాలన్నారు.

Read Also: Tollywood Progress Report: జనవరిలో వీరయ్య వీరంగం! వీరసింహ గర్జన!!

Show comments