NTV Telugu Site icon

MP Arvind: బీఆర్ఎస్ ఓటమికి కేటీఆర్, కవితలే కారణం

Arvindh

Arvindh

నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హేమా హేమీలకు ఓటమి తప్పదు.. ఎన్నికల్లో ఓడిపోయిన కవితకు మా గురించి మాట్లాడే అర్హత లేదు అని ధర్మపురి అర్వింద్ అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదు అని ఆయన చెప్పుకొచ్చారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడిపోతారు అంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు.

Read Also: Bananas At Risk: అరటిపండు కనుమరుగు..? శాస్త్రవేత్తల హెచ్చరిక

అయితే, బీఆర్ఎస్ ఓటమికి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత లే కారణం అని ఆయన ధ్వజమెత్తారు. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సగం మంది ఆ పార్టీలో ఉండరు అని ఆయన ఆరోపించారు. కవితపై ఈడీ విచారణ కొనసాగుతోంది.. ఆధారాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని కాపాడుతోంది.. కోరుట్లలో పద్మశాలి బంధుకు నా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను అని ఆయన తెలిపారు. కోరుట్లలో 20 శాతం పైగా ఓట్ల మెజారిటీతో గెలుస్తాను అని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. కవిత నన్ను ఓడించడం కాదు వాళ్ళ కార్యకర్తలే ఆమె ను ఓడించారు.. తెలంగాణలో బీజేపీకి స్పష్టమైన మెజారిటి వస్తుంది.. ఉత్తర తెలంగాణలో స్వీప్ చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also: WhatsApp: ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో వాట్సాప్ ఇక పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

అయితే, జగిత్యాల కోరుట్ల పద్మశాలిలకు రాజకీయ పార్టీలు టికెట్ కేటాయించక పోవడంతో రేపు నియోజక వర్గం బంద్ కు పిలుపు ఇచ్చారు. ఈ బంద్ కు బీజేపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ మద్దతు తెలిపారు. జగిత్యాల అసెంబ్లీ టికెట్ పద్మశాలి అయిన భోగ శ్రావణికి బిజేపి కేటాయించింది.. రేపు నియోజక వర్గ పరిధిలో జరుగనున్న బీజేపీ ర్యాలీని అర్వింద్ రద్దు చేసుకున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కేవలం కార్యకర్తల మీటింగ్ లో ఆయన పాల్గొన్ననున్నారు. పద్మశాలి కుల సంఘాలకు నా పుర్తి మద్దతు ఉంటుంది అని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు.