నిజామాబాద్ పార్లమెంటు జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం వాగ్దానం చేసి గెలిచిన సీఎం కేసీఆర్…. ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. ఫామ్ హౌస్ లు కట్టుకున్న వారికి ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్ లో టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం, భగీరథ పేరుతో సీఎం కేసీఆర్, టాయిలెట్స్ పేరుతో ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. అవినీతి లేకుండా అభివృద్ధి పనులు దేశంలో నడుస్తున్నాయని, భారత దేశానికి సరైన సమయంలో ప్రధానిగా మోడీ కావటం దేశ ప్రజల అదృష్టమన్నారు ఎంపీ అర్వింద్.
Allahabad High Court: కుజదోషం ఉందని కోర్టుకెక్కిన యువకుడు.. కోర్టు ఏం చెప్పిందంటే
అగ్రవర్ణాల పేదలకు 10 శాతం ఈడబ్ల్యుఎస్ లో రిజర్వేషన్ ఇచ్చారు పీఎం అని, మూడోసారి బీజేపీని గెలిపిస్తే భారత్ ప్రపంచ దేశాల్లో ఇంకా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇదిలా ఉంటే.. ఒడిశా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై ఆయన స్పందిస్తూ.. ఒడిశా రైళ్ల ప్రమాదం మానవ తప్పిదం కావచ్చని అన్నారు. పూర్తి విచారణ తర్వాత బాధ్యులు ఎవరో తేలుతుందన్నారు ఎంపీ అర్వింద్. కవచ్ ట్రయల్స్ సికింద్రాబాద్లో జరిగినపుడు తానున్నానని గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా ఇంకా అమల్లోకి రాలేదని, 2025 వరకు పూర్తి కావచ్చన్నారు. విడతల వారీగా కవచ్ టెక్నాలజీ ఏర్పాటు అవుతోందన్నారు.
Kurnool Pregnancy Case: యువతి గర్భవతి.. డీఎన్ఏ టెస్ట్ కోరిన యువకుడు.. చివరికి షాక్