Site icon NTV Telugu

MP Arvind : హాస్టల్‌లో పురుగుల అన్నం పెడుతున్నారు.. ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు

Mp Arvind

Mp Arvind

రైతులు పండించిన పంటలకు ధరలు తగ్గినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్పీ పథకం అమలు చేయాలి.. రైతులకు మద్దతుగా నిలవాలన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని దేశాలు దిగుమతులు నిలిపివేయడం వల్లే పసుపు ధర పడిపోయిందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే పసుపు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు అర్వింద్. అన్ని పథకాలు యధావిధిగా కొనసాగిస్తూ కొత్త పథకాలు అమలు చేస్తామని, కాళేశ్వరం లిఫ్ట్ డిపిఆర్ తో పాటు సరైన లెక్కలు ఇస్తే జాతీయ హోదా కల్పిస్తామన్నారు అర్వింద్. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాలనీల్లో కుక్కలు ఆసుపత్రుల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని, హాస్టల్ లో పురుగుల అన్నం పెడుతున్నారని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అర్వింద్ మండిపడ్డారు.

Also Read : Zomato: కొత్త సర్వీస్‌కు జొమాటో శ్రీకారం..

శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయని, ప్రమాదపు అంచులో ఉన్నాయని అర్వింద్ ధ్వజమెత్తారు. మైనారిటీ ప్రాంతాల్లో కూడా పర్యటిస్తానని, ప్రజా సమస్యలు తెలుసుకుంటానని ఆయన అన్నారు. పసుపు బోర్డు, సుగంధ ద్రవ్యాల బోర్డుకు పెద్దగా తేడా లేదని, సుగంధ ద్రవ్యాల బోర్డు వేగంగా పనిచేస్తోందన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లు వస్తే పొలం నుంచే నేరుగా సరకు విక్రయమని, మౌలిక సౌకర్యాల కోసం వడ్డీ లేని రుణాలను కేంద్రం ఇస్తోందన్నారు. ఐదేళ్లలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.4,418కోట్లు ఇచ్చిందని, రైల్వేస్టేషన్లను అధునాతన సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారన్నారు.

Also Read : Land Official Jobs: 6వేల పట్వారీ జాబ్‌లకు 12లక్షల అప్లికేషన్లు.. డాక్టరేట్ హోల్డర్లతో సహా..

Exit mobile version