DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘#90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్‌తో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు మౌళి. ఇక గతేడాది ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో యూత్‌ను ఆకట్టుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్ ఇప్పుడు తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ చిత్రానికి ‘దొంగ నా కొడుకు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ వెనుక హీరో మౌళికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. మౌళి ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం గతేడాది సెప్టెంబర్ 5న విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ తో సెప్టెంబర్ మొదటి వారంలోనే ‘దొంగ నా కొడుకు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఒక జ్యువెలరీ షాప్ రాబరీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ అండ్ రాబరీ కామెడీ డ్రామాపై ఇప్పటికే సినీ వర్గాల్లోనూ, డిజిటల్ ఆడియన్స్‌లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మౌళి కామెడీ టైమింగ్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని టీమ్ ధీమాగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాకింగ్ ఉండటంతో ‘లిటిల్ హార్ట్స్’ సెంటిమెంట్ కలసివచ్చి ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
- Virat Kohli: "ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది".. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
తాజావార్తలు
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?