ఇటీవల విడుదలైన “లిటిల్ హార్ట్స్” సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నటుడు మౌళి తనూజ్‌క నటుడు నాని నుంచి ప్రత్యేక ప్రశంసలు అందాయి. ఈ సందర్భంగా, మౌళి తన సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, నాని అన్నకి నేను అభిమానిని అంటూ కొనియాడాడు. ఈ సందర్భంగా ఆయన రాసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాని ఇటీవల తన ఎక్స్ ఖాతాలో “లిటిల్ హార్ట్స్” సినిమా గురించి రివ్యూ షేర్ చేశాడు. ఈ రివ్యూలో, ఆయన ఈ సినిమాను ఒక బ్రీజీ ఫన్ ఫిల్మ్‌గా అభివర్ణించి, దీనిని చూసి ఎంతో ఆనందం పొందినట్టు తెలిపారు. ఈ రివ్యూను గమనించిన మౌళి తనూజ్, తన ఎక్స్ పోస్ట్‌లో ఈ విషయాన్ని పంచుకున్నాడు.
“🥹🥹 థాంక్స్ ఎ లాట్ నాని అన్నా, నీకు తెలియక పోవచ్చు అన్న కానీ నేను మీకు పిల్ల జమీందారు సినిమా నుంచి పెద్ద అభిమానిని, నాకు ముందే మిమ్మలని కలిసే అవకాశం వచ్చింది కానీ ఒక రాండమ్ ఫ్యాన్ గా కాకుండా, నా వర్క్ మీకు తెలిసాకే కలుద్దాం అని ఫిక్స్ అయ్యాను. నేను అందుకోసమే పని చేశా, ఈరోజు కొట్టా, అని ఆయన చెప్పుకొచ్చారు. తన కష్టం ఫలించి, ఇప్పుడు తన ప్రతిభను నాని ప్రశంసించడం ఆయనకు గర్వంగా ఉందని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా, ఆయన ఒక ధైర్యంగా ఉన్న ఛాలెంజ్‌ను కూడా ప్రకటించాడు. “ఈరోజు ఒక కొత్త ఛాలెంజ్ పెట్టుకుంటా,ఏదో ఒక రోజు నీ ‘గోడలో ఇటుక అవుతా’ పక్కా🔥🔥” అని రాసుకొచ్చాడు.
“లిటిల్ హార్ట్స్” సినిమా ఇప్పటికే విడుదలైన నాలుగు రోజుల్లో 15.41 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. దర్శకుడు సాయి మార్తాండ్, నిర్మాత ఆదిత్య హాసన్ సమర్పణలో వచ్చిన ఈ సినిమా, బన్నీ వాస్, వంశీ నందిపాటి బ్యానర్స్‌పై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
