Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్‌సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!

Motorola

Motorola

Motorola Moto One: మోటరోలా (Motorola) మరోసారి తన వన్ (One) సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా ‘moto one’ పేరుతో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ వైర్ లెస్ పవర్ కన్సార్టియం (WPC) డేటాబేస్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా ఫోన్ డిజైన్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. అయితే ఈ ఫోన్ పేరును, లాంచ్ ప్రణాళికలను మోటరోలా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ Geekbench బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫామ్‌లో కూడా ఈ ఫోన్ నాలుగు సార్లు కనిపించింది. అందులో వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌తో పనిచేయనుంది. దీనికి 12GB RAM, Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. గీక్ బెంచ్ పరీక్షల్లో ఈ ఫోన్ అత్యధికంగా సింగిల్ కోర్ టెస్టులో 2,109 పాయింట్లు, మల్టీ కోర్ టెస్టులో 8,586 పాయింట్లు సాధించింది. ఇదే చిప్‌సెట్‌తో పనిచేసే ఇతర ఫోన్ల పనితీరుకు ఈ స్కోర్లు దగ్గరగా ఉన్నాయి. అయితే ఇవి ప్రీ-రిలీజ్ బెంచ్‌మార్క్ ఫలితాలు కావడంతో తుది పనితీరులో మార్పులు ఉండే అవకాశం ఉంది.

WPC సర్టిఫికేషన్ ద్వారా ఈ ఫోన్‌లో 15W Qi వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే వైర్డ్ ఛార్జింగ్ సామర్థ్యానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఫోన్ బ్యాటరీ సామర్థ్యం, డిస్‌ప్లే పరిమాణం, కెమెరా స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలు కూడా ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. మోటరోలా 2018లో One సిరీస్‌ను అప్పర్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు Snapdragon 8 Gen 5 వంటి శక్తివంతమైన ప్రాసెసర్‌తో కొత్త ఫోన్‌ను తీసుకురానుండటం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ ఫోన్ నిజంగానే One సిరీస్‌లో భాగమైతే, గతంలో కంటే ఉన్నతమైన ప్రీమియం సెగ్మెంట్‌లోకి ఈ సిరీస్ అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే ‘moto one’ అనేది తాత్కాలిక పేరు మాత్రమే కావచ్చని కూడా సమాచారం.