Special Ofers on Moto G04 Smartphone: బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్న ప్రముఖ మొబైల్ సంస్థ ‘మోటోరోలా’.. మరో ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ‘మోటో జీ04’ను గురువారం (ఫిబ్రవరి 15) భారత్‌లో లాంచ్ చేసింది. మోటో జీ సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ ఫోన్ అమ్మకాలు ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆరంభం అవుతాయి. రూ.7వేల ధరలో వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్ 4జీ నెట్‌వర్క్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
Moto G04 Price and Offers:
మోటో జీ04 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.6,999గా.. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.7,999గా కంపెనీ పేర్కొంది. ఎక్స్‌ఛేంజ్‌పై రూ.750 అదనంగా మీకు లభిస్తుంది. ఒకవేళ మీరు రిలయన్స్ జియో కస్టమర్లు అయితే.. రూ.399 రీఛార్జిపై రూ.2 వేల వరకు క్యాష్‌బ్యాక్ (రూ.50 చొప్పున కూపన్లు) లేదా రూ.2,500 విలువైన యాత్ర, అజియో, నెట్‌మెడ్స్ కూపన్లు లభిస్తాయి. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటోరొలా, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులో ఉంటుంది.
Moto G04 Features:
మోటో జీ04 స్మార్ట్‌ఫోన్‌లో 6.56 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇది 1612 x 720p రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 537 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. యూనిసోక్ T606 ప్రాసెసర్ అమర్చారు. మోటో జీ04 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14తో పనిచేస్తుంది. ఈ ఫోన్ బరువు 178.8 గ్రాములు. ఈ బడ్జెట్ ఫోన్ కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ మరియు సన్‌రైజ్ ఆరెంజ్ రంగు ఎంపికలలో లభిస్తుంది.
Also Read: Hyderabad Women Cricketers: మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన.. మద్యం సేవిస్తూ..!
Moto G04 Camera and Battery:
మోటో జీ04 ఫోన్ వెనక 16ఎంపీ ప్రధాన కెమెరా ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్ ఇచ్చారు. వీడియోకాల్స్, సెల్ఫీ కోసం ముందువైపు 5 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సప్పోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.