Site icon NTV Telugu

Motorola Edge 70 అమ్మకాలు షురూ.. ఎక్కడ కొనచ్చంటే..?

Motorola Edge 70

Motorola Edge 70

Motorola Edge 70: మోటరోలా డిసెంబర్ 15న భారత మార్కెట్లో తన కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Motorola Edge 70 ను లాంచ్ చేసింది. నేటి నుంచి ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా విక్రయానికి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒక్క వేరియంట్‌లోనే లభించనుండగా.. పాంటోన్ ఎంపిక చేసిన మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.

Champion: రోషన్–నితీష్ కుమార్ రెడ్డి మధ్య ఫన్నీ చిట్‌చాట్.. ‘ఛాంపియన్’ ప్రమోషన్ వీడియో వైరల్

ఈ Motorola Edge 70లో లేటెస్ట్ Android 16 OS ప్రీ-ఇన్‌స్టాల్ అయి వస్తుంది. అలాగే తాజా Snapdragon 7 సిరీస్ ప్రాసెసర్ తో ఈ ఫోన్‌ను అందించారు. ముఖ్యంగా ఇందులో ఉపయోగించిన 5,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ వల్ల, అధునాతన టెక్నాలజీ ఉన్నప్పటికీ ఫోన్ మరింత స్లిమ్‌గా, తేలికగా తయారైంది. భారత మార్కెట్లో Motorola Edge 70 ధర రూ. 29,999గా నిర్ణయించారు. ఇది 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఒక్క వేరియంట్‌లోనే లభిస్తుంది.

లాంచ్ ఆఫర్‌గా M1 బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో Axis Bank Flipkart డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 750 వరకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే Flipkart SBI క్రెడిట్ కార్డ్ యూజర్లకు రూ. 4,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

WPL 2026: ఇట్స్ ఆఫీసియల్.. న్యూ సీజన్.. న్యూ కెప్టెన్.. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ గా జెమిమా రోడ్రిగ్స్‌..!

Motorola Edge 70లో 6.7 ఇంచుల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. భద్రత పరంగా ఈ ఫోన్‌కు IP68 + IP69 రేటింగ్తో పాటు MIL-STD టెస్టింగ్ కూడా ఉంది. పనితీరు కోసం ఇందులో Qualcomm Snapdragon 7 Gen 4 చిప్‌సెట్, LPDDR5x ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ అందించారు. మోటరోలా హామీ ప్రకారం ఈ డివైస్‌కు మూడు Android OS అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందనున్నాయి. అలాగే Moto AI ఆధారిత పలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Exit mobile version