Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola edge 70 pro+ Launch: మోటరోలా (Motorola) కొత్తగా మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ (Motorola edge 70 pro+) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎడ్జ్ 70 సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని లాంచ్ అయ్యింది. కేవలం 6.99 మిల్లీమీటర్ల మందంతో, 190 గ్రాముల బరువుతో స్లిమ్ అండ్ స్టైలిష్ డిజైన్‌ను అందిస్తోంది. పాంటోన్ కలర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ప్రత్యేక ఫినిష్‌లలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. పాంటోన్ జిన్‌ఫాండెల్, పాంటోన్ చికోరి కాఫీ, పాంటోన్ స్టార్మీ సీ అనే 3 రంగులలో అందుబాటులోకి వచ్చింది.
ఫోన్ ముందు భాగంలో 6.8 అంగుళాల సూపర్ HD+ ఎక్స్ట్రీమ్ AMOLED 1.5K డిస్ప్లేను అందించగా.. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 96.8% స్క్రీన్-టు-బాడీ రేషియోతో అద్భుతమైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో పాటు.. స్మార్ట్ వాటర్ టచ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం మోటరోలా ఈ ఫోన్లో క్వాడ్ కెమెరాలను తీసుకొచ్చారు. ఇందులో 50MP Sony LYTIA 710 ప్రధాన కెమెరా OIS సపోర్ట్‌తో వస్తుంది. అలాగే 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 3.5x ఆప్టికల్ జూమ్, 50x AI సూపర్ జూమ్ ప్రో ఫీచర్లను కలిగి ఉంది. మరో 50MP అల్ట్రా వైడ్ అండ్ మాక్రో కెమెరా 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ అందిస్తే.. సెల్ఫీల కోసం 50MP ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరాను అందించారు. అన్ని కెమెరాల ద్వారా 4K 60FPS వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఉంది.
Also Read
- Smartphone Under 10,000: రూ. 10000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. భారీ బ్యాటరీలు, 50MP కెమెరాలు 90Hz డిస్ప్లేలతో..
- Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
- Air Conditioner: ఏసీని ఈ ఉష్ణోగ్రతలో పెడితే కరెంట్ బిల్లు తగ్గుతుందా? చాలామందికి తెలియని నిజాలు
- Google AI Scam Call Detection: గూగుల్ నుంచి కొత్త AI స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్.. యూజర్లకు భారీ ఊరట
మోటరోలా ప్రత్యేక motoAI టెక్నాలజీ సహాయంతో లో-లైట్ ఫోటోగ్రఫీ, డైనమిక్ రేంజ్, టెక్స్చర్ రిప్రొడక్షన్ మరింత మెరుగుపడుతుంది. ఈ ఫోన్‌కు MediaTek Dimensity 8500 Extreme 4nm ప్రాసెసర్ శక్తినిస్తోంది. అలాగే ఇది12GB LPDDR5X RAM, 256GB UFS 4.1 స్టోరేజ్‌తో ఫోన్ వేగంగా స్పందిస్తుంది. ఇంకా ఇందులోని 4600mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ద్వారా వేడి నియంత్రణ మరింత మెరుగుపడింది. స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్, Hi-Res ఆడియో సపోర్ట్‌తో ఆడియో అనుభవం కూడా ప్రీమియంగా ఉంటుంది.

కేవలం 6.99 మి.మీ. మందంతో ఉన్నప్పటికీ.. ఇందులో 6500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. దీనిని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 51 గంటల వరకు వినియోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 90W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 9 నిమిషాల్లో 12 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. అలాగే 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ IP68 + IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లతో వస్తుంది. అంతేకాకుండా MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను పొందింది. అధిక ఉష్ణోగ్రతలు, తేమ, దుమ్ము, 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయినా తట్టుకునేలా రూపొందించారు.
మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ Android 16 ఆధారిత Hello UIతో వస్తోంది. కంపెనీ 3 ప్రధాన ఆండ్రాయిడ్ అప్డేట్లు, 5 సంవత్సరాల భద్రతా అప్డేట్లను అందించనుంది. భారత మార్కెట్లో మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ కేవలం ఒక్క 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.47,999గా నిర్ణయించారు. జూన్ 11 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్ కింద యాక్సిస్ బ్యాంకు, ICICI బ్యాంకు కార్డులపై రూ.3,000 తక్షణ తగ్గింపు లేదా రూ.3,000 ఎక్స్చేంజ్ బోనస్‌ను కంపెనీ అందిస్తోంది.
తాజావార్తలు
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
India S-400 Squadron: భారత్‌కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!