Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivek Agarwal’s Family: కొన్నిసార్లు ప్రమాదాలు కేవలం ప్రాణాలను మాత్రమే తీసుకోవు.. పచ్చని కుటుంబాల కథలను, వారి కలలను సమాధి చేస్తాయి. ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఉన్న ఒక హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఇటువంటి ఒక హృదయవిదారక విషాదాన్ని మిగిల్చింది. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న తండ్రిని కాపాడుకోవాలని, ఆయనకు మనోధైర్యం చెప్పాలని వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన వారు.. మంటలు, పొగల మధ్య ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంతో ఆ కుటుంబంలో దీపం వెలిగించే వారే లేకుండా పోయారు.
తండ్రి కోసం వచ్చి.. మృత్యుఒడిలోకి చేరారు
గురుగ్రామ్‌కు చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) వివేక్ అగర్వాల్ తండ్రి తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్లో చేరారు. ఐసీయూలో ఉన్న తండ్రిని పరామర్శించడానికి, ఆయనకు ధైర్యం చెప్పి ఆయనను కోలుకునేలా చేయాలని వివేక్ అగర్వాల్ తన భార్య, ఇద్దరు కుమార్తెలు, తల్లితో కలిసి ఢిల్లీకి వచ్చారు. ఆసుపత్రికి దగ్గరగా ఉంటుందని మాల్వీయా నగర్‌లోని ఒక హోటల్లో గది బుక్ చేసుకున్నారు. ఇదే సమయంలో వివేక్ అగర్వాల్‌ను, ఆయన తండ్రిని చూడటానికి వివేక్ మామ, అత్త, మరో బంధువు కూడా ఢిల్లీకి వచ్చి అదే హోటల్లో బస చేశారు. రాత్రంతా మామూలుగానే గడిచింది. మరుసటి రోజు ఉదయం ఆసుపత్రికి బయలుదేరడానికి అందరూ రెడీ అవుతున్న టైంలో.. ఒక్కసారిగా హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిమిషాల వ్యవధిలోనే భవనం అంతా దట్టమైన పొగ, మంటలు వ్యాపించడంతో, ఆ కుటుంబం ప్రాణాలు కాపాడుకోవడానికి చేసిన పోరాటం విఫలమైంది. పొగలో ఊపిరాడక, కాలిన గాయాలతో వారి కుటుంబ సభ్యుల్లో చాలా మంది అక్కడికక్కడే మరణించారు.
Also Read
- Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
- Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
- Rahul Gandhi New Team: రాహుల్ గాంధీ కొత్త టీమ్ రెడీ.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
ఈ విషాదంలో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే.. మాక్స్ ఆసుపత్రి బెడ్‌పై చావుబతుకుల మధ్య ఉన్న వృద్ధ తండ్రికి తన కొడుకు, కోడలు, మనవరాలు ఇక లేరనే నిజం ఇప్పటికీ తెలియదు. తనను చూడటానికి వస్తున్నారనుకున్న ఆ అడుగుల చప్పుడు శాశ్వతంగా ఆగిపోయిందనే చేదు నిజాన్ని మోస్తూ ఆ వృద్ధుడు ఆసుపత్రిలో ఒంటరిగా మిగిలిపోయారు. ఇటు గురుగ్రామ్ సెక్టర్ 46లోని వివేక్ అగర్వాల్ నివాసం వద్ద శ్మశాన నిశ్శబ్దం నెలకొంది. ఎప్పుడూ నవ్వులతో కళకళలాడే ఆ ఇల్లు ఇప్పుడు మూగబోయింది. సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే వివేక్, పిల్లల చదువుల కోసం వ్యాపారాన్ని కూడా వదులుకున్న ఆయన భార్య, చదువుల్లో టాపర్లుగా నిలిచే ఇద్దరు కుమార్తెలు రాత్రికి రాత్రే అనంతలోకాలకు వెళ్లిపోయారనే వార్తను ఇరుగుపొరుగు వారు నమ్మలేకపోతున్నారు.
కటకటాల వెనక్కి హోటల్ యజమాని..
ఈ దారుణ ఘటనపై ఢిల్లీ పోలీసులు తీవ్రంగా స్పందించారు. హోటల్ యజమాని లవేకేశ్ బజాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఈ భవనాన్ని కొనుగోలు చేసి, గతంలో ఉన్న ఖాదీ దుకాణాన్ని హోటల్, గెస్ట్ హౌస్‌గా మార్చినట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే హోటల్‌కు సరైన అనుమతులు ఉన్నాయా? అగ్నిమాపక భద్రతా నియమాలు (Fire Safety) పాటించారా? ప్రమాదం జరిగినప్పుడు ఎగ్జిట్ మార్గాలు తెరిచే ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. నిందితులు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు యజమానితో పాటు అతని భార్యపై కూడా పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.
తాజావార్తలు
-
YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
-
Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!