Site icon NTV Telugu

భారత్‌కు రానున్న Motorola Edge 70.. డిజైన్, స్పెక్స్ లీక్..!

Motorola Edge 70

Motorola Edge 70

Motorola Edge 70: మోటరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ Edge 70 ను భారత మార్కెట్లో అనుకున్నదానికంటే ముందుగానే తీసుకురానుందని సమాచారం. కొన్ని లీకుల వివరాల ప్రకారం.. ఈ ఫోన్ డిసెంబర్ 15 తర్వాత భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత్‌కు రానున్న కలర్ వేరియంట్లకు సంబంధించిన మొదటి లుక్స్ కూడా బయటకు వచ్చాయి. లీక్ ల ప్రకారం భారత మోడల్‌లో గ్లోబల్ వెర్షన్‌తో పోలిస్తే పెద్ద బ్యాటరీ, 5.99mm స్లిమ్ ప్రొఫైల్ అలాగే ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా భారత మార్కెట్ ధర రూ.35,000 లోపుగా ఉండవచ్చని సమాచారం.

Lionel Messi: ప్రపంచ కప్‌కు ముందే మెస్సీ రిటైర్? దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ సంచలన ప్రకటన!

లీక్ అయిన రిందర్‌ల్లో మూడు కొత్త టెక్స్చర్డ్ ఫినిష్‌లు, కెమెరాల చుట్టూ ఆకర్షణీయమైన యాక్సెంట్ రింగులు కనిపిస్తున్నాయి. డిజైన్ సింపుల్, క్లీన్ గా ఉండి 2026 కోసం మోటరోలా తీసుకువస్తున్న కొత్త డిజైన్ గా కనపడుతుంది. ఇక ఇండియన్ వెర్షన్‌లో గ్లోబల్ వెర్షన్ కంటే పెద్ద బ్యాటరీ, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ కేవలం 5.99mm అల్ట్రా-స్లిమ్ బాడీ ఉండనున్నాయి. భారత యూజర్ల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా బ్యాటరీ, ధర వంటి అంశాల్లో మోటరోలా స్వల్ప మార్పులు చేసి ఉంటుందని తెలుస్తోంది.

ప్రీమియమ్ డిజైన్, జియో ఎకోసిస్టమ్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీతో Cellecor 4K QLED టీవీలు లాంచ్..!

నవంబర్‌లో గ్లోబల్‌గా లాంచ్ అయిన Motorola Edge 70 ఇప్పటికే ఫోన్ ఎలా ఉండబోతోందనే దానికి ఒక క్లియర్ ఐడియాను ఇచ్చింది. ఈ వెర్షన్‌లో 5.99mm అల్ట్రా-థిన్ డిజైన్, ఎయిర్‌క్రాఫ్ట్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, సాఫ్ట్ నైలాన్-ఫీల్ బ్యాక్, Pantone రంగుల ఎంపిక, IP68 / IP69 రేటింగ్, Gorilla Glass 7i, మూడు 50MP కెమెరాలు (ప్రధాన సెన్సర్ 4K వీడియోతో, అల్ట్రావైడ్ + మాక్రో లెన్స్, హై-రెజోల్యూషన్ ఫ్రంట్ కెమెరా), మోటో ai తో కలర్ ట్యూనింగ్, పోట్రెయిట్‌లు, సీన్ ఆప్టిమైజేషన్, Snapdragon 7 Gen 4 చిప్‌సెట్, 4800mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 68W వైర్డ్ + 15W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నాయి. భారత వెర్షన్ కూడా ఇదే స్పెసిఫికేషన్‌లను ప్రధానంగా అనుసరించే అవకాశం ఉంది. అయితే బ్యాటరీ సామర్థ్యంలో స్వల్ప మార్పులు, ధరలో కాస్త తగ్గింపు ఉంటుందని లీక్స్ సూచిస్తున్నాయి.

Exit mobile version