Site icon NTV Telugu

Motorola edge 60: 50MP ట్రిపుల్ కెమెరా, IP68 + IP69 రెసిస్టెంట్‌తో లాంచ్ కాబోతున్న మోటరోలా ఎడ్జ్ 60..!

Motorola Edge 60

Motorola Edge 60

Motorola edge 60: భారతదేశంలో మోటరోలా Edge 60 స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 10న అధికారికంగా లాంచ్ కాబోతున్నట్లు ప్రకటించింది. గత ఏప్రిల్‌లో Edge 60 Proతో పాటు అంతర్జాతీయంగా పరిచయం చేసిన తర్వాత ఇది భారత్‌లోకి అడుగుపెడుతోంది. భారత వెర్షన్‌లో గ్లోబల్ వేరియంట్‌కి ఉన్న మీడియాటెక్ Dimensity 7300 ప్రాసెసర్‌కి బదులుగా మరింత మెరుగైన Dimensity 7400 SoC ప్రాసెసర్ ఉండనుంది. అలాగే గ్లోబల్ వెర్షన్ కంటే పెద్దదైన 5500mAh బ్యాటరీతో రాబోతుంది.

Read Also: REDMAGIC Tablet 3 Pro: 8200mAh బ్యాటరీ, గేమింగ్‌కి హై స్పీడ్ గ్యారంటీతో రాబోతున్న REDMAGIC టాబ్లెట్..!

ఈ ఫోన్ పాన్ టోన్ జిబ్రాల్టర్ సి, పాన్ టోన్ శామ్ రాక్ వంటి రెండు ప్రత్యేక పాన్ టోన్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్ 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్‌లో మాత్రమే లభించనుంది. మోటరోలా ఎడ్జ్ 60 ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్, మోటోరోలా, ఆఫ్లైన్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ మొబైల్ పూర్తి స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

మోటరోలా ఎడ్జ్ 60 ఫోన్ 6.67 అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లేతో రాబోతుంది. దీని రిజల్యూషన్ 2712 x 1220 పిక్సెల్స్ కాగా.. 120Hz రిఫ్రెష్ రేట్, 10-bit కలర్ సపోర్ట్, గరిష్ఠంగా 4500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i కవర్ ఉంటుంది. ఈ ఫోన్‌లో శక్తివంతమైన మీడియాటెక్ Dimensity 7400 (4nm) చిప్‌సెట్‌ను ఉపయోగించారు. అలాగే ఇందులో Mali-G615 MC2 GPUతో వస్తుంది. ఇది 12GB LPDDR4X RAM, 256GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. అవసరమైతే మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజ్ విస్తరించవచ్చు. ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తుంది. దీనికి మూడు సంవత్సరాల OS అప్‌డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి.

Read Also: REDMAGIC 10S Pro: మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో గేమర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్ మేజిక్ 10S ప్రో లాంచ్..!

ఇక కెమెరా పరంగా ఇందులో 50MP ప్రైమరీ కెమెరా (Sony LYTIA 700C సెన్సార్‌తో, OIS సపోర్ట్), 50MP అల్ట్రా-వైడ్ కెమెరా (మ్యాక్రో మోడ్‌), 10MP టెలిఫోటో కెమెరా (3x జూమ్, 30x సూపర్ జూమ్) ఉన్నాయి. వీటితో 4K @30fps వీడియో రికార్డింగ్ చేయవచ్చు. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉండి, అది కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది.

ఇక ఆడియో పరంగా ఫోన్‌కి స్టీరియో స్పీకర్లు, USB Type-C ఆడియో, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ లభిస్తుంది. ఇది IP68 + IP69 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ తోపాటు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో తయారు చేయబడింది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 5500mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఇది 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీగా 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6E, Bluetooth 5.4, GPS, USB Type-C పోర్ట్ లభిస్తాయి. ఇది డ్యూయల్ సిమ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కలిపి మోటరోలా ఎడ్జ్ 60ను ప్రీమియం ఫీచర్లు కలిగిన, మంచి డిజైన్ గల ఫోన్‌గా నిలబెడతాయి.

Exit mobile version