Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

Motorola Edge 2025

Motorola Edge 2025

Motorola Edge 2025: మోటరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన “మోటరోలా ఎడ్జ్ 2025” ను అమెరికాలో అధికారికంగా ప్రకటించింది. గతేడాది విడుదలైన మోడల్‌కు వారసంగా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. మరి ఈ మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా..

మోటరోలా ఎడ్జ్ 2025 ఫోన్‌లో 6.7-అంగుళాల 1.5K (2712×1220 pixels) OLED Endless Edge డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 1400 నిట్స్ HBM బ్రైట్‌నెస్, గరిష్టంగా 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ తో వస్తోంది. గేమింగ్‌కు అనుకూలంగా 300Hz టచ్ సాంప్లింగ్ రేట్, 720Hz PWM డిమ్మింగ్ కలిగి ఉంది. స్క్రీన్‌కు Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్ ప్రపంచంలో మొట్టమొదటి సారిగా MediaTek Dimensity 7400 4nm చిప్‌సెట్ తో వచ్చింది. దీనిలో 8GB LPDDR4X RAM, 256GB UFS 2.2 స్టోరేజ్ ఉంది. microSD కార్డ్ ద్వారా మెమరీని మరింత విస్తరించుకునే అవకాశం కూడా ఉంది.

×
×
Ad

Read Also: Bank holidays in June: జూన్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?

ఫొటోగ్రఫీ పరంగా మొబైల్ వెనుక భాగంలో 50MP Sony Lytia LYT-700C సెన్సార్‌తో కూడిన ప్రధాన కెమెరా (f/1.88), OIS సపోర్ట్, అలాగే 50MP అల్ట్రావైడ్ కెమెరా (f/2.0), మ్యాక్రో మోడ్ తో వస్తుంది. సెల్ఫీ కోసం ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా (f/1.9) ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 5200mAh భారీ బ్యాటరీ తో వస్తోంది. ఇది 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆడియో పరంగా స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, USB Type-C ఆడియో కూడా ఉంది.

Read Also: Robot Fightin: ప్రపంచంలోనే తొలిసారి.. రోబోల మధ్య బాక్సింగ్ మ్యాచ్.. ఒకరిపై ఒకరు పంచ్‌ల వర్షం

ఈ ఫోన్ Android 15 పై రన్ అవుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్‌కి MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, అలాగే IP68 + IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇది 1.5 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాలపాటు ఉన్న తగిన ప్రొటెక్షన్ ఇవ్వగలదు. ఇక ఈ మోటరోలా ఎడ్జ్ 2025 ఫోన్‌ పాన్ టోన్ డీప్ ఫారెస్ట్ కలర్ లో అందుబాటులోకి రానుంది. దీని ధర 549.99 డాలర్స్ (సుమారు ₹46,995)గా నిర్ణయించారు. జూన్ 5 నుంచి ఈ ఫోన్‌ అమెజాన్, మోటోరోలాలో అన్‌లాక్‌డ్ వెర్షన్‌గా లభ్యం కానుంది.