Site icon NTV Telugu

Live Incident: ఎన్ని బాధలున్నాయ్ కొడుకా.. ఇలా కావాలనే రైలుకింద పడ్డావు

Train

Train

Live Incident: ముంబైలోని విలేపార్లే రైల్వే స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ రైల్వే ఉద్యోగి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన జనవరి 26న జరిగింది. అతడి పేరు రాకేష్ గౌడ్. పశ్చిమ రైల్వేలో చీఫ్ లోకో ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ పై నిల్చుని ఉన్నారు. కాసేపు అటు ఇటు తిరిగారు. ఇంతలో రైలు రావడాన్ని చూశాడు. అంతే.. ఉన్నట్లుండి ప్లాట్ ఫామ్ నుంచి దిగి ట్రాక్ పై పరిగెత్తి పడుకున్నాడు.

Read Also: Jharkhand Fire Accident : విషాదం.. పెళ్లికని వచ్చారు.. కళ్లెదుటే కాలిపోయారు

కాసేపు అక్కడున్న వారికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఇంతలో రైలు వచ్చేసింది. రైలు అతడి పైనుంచి వెళ్లడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఆ వ్యక్తి అలా సూసైడ్ చేసుకోవడాన్ని కళ్లారా చూసి షాక్ అయ్యారు. ఆయన ఎందుకలా పట్టాలపైకి దిగాడో అర్థమయ్యేలోపే ఆయన ప్రాణం పోయింది. కళ్ల ముందే సూసైడ్ ఘటన చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు కారణం తెలియాల్సి ఉంది. పని ఒత్తిడి కారణంగా ఆ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోలేని రైల్వే అధికారులు తెలిపారు.

Exit mobile version