Moto G67, G77: మోటరోలా(Motorola) G సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. Moto G67, Moto G77 పేర్లతో ఇవి మార్కెట్లోకి రాబోతున్నట్లు సమాచారం. గ్రీక్ ఆన్‌లైన్ రిటైల్ వెబ్‌సైట్‌లో లభించిన లిస్టింగ్ ఆధారంగా ఈ ఫోన్లకు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఇప్పటివరకు Moto G57లో LCD డిస్‌ప్లే ఇచ్చిన మోటరోలా.. ఈసారి G67, G77 మోడళ్లలో OLED డిస్‌ప్లేకు మారనుందని సమాచారం.
CM Chandrababu Davos Visit: మూడో రోజు దావోస్ టూర్.. నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు..
Moto G67లో మీడియాటెక్ డైమెంసిటీ 6300 ప్రాసెసర్ ఉండగా, Moto G77లో మరింత శక్తివంతమైన డైమెంసిటీ 6400 చిప్‌సెట్ ఇవ్వనున్నారు. అలాగే G67లో 4GB RAM, 50MP మెయిన్ కెమెరా ఉండగా.. G77లో 8GB RAM, 108MP మెయిన్ కెమెరా అందించనున్నారు. ఈ రెండు ఫోన్లలో 6.8 అంగుళాల 1.5K ఎక్స్‌ట్రీమ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
WhatsApp New Button Feature: వాట్సాప్‌లో కొత్త బటన్.. ఒకే క్లిక్‌తో సరికొత్త ఫీచర్లు..!
G67లో 50MP సోనీ LYT-600 సెన్సర్‌తో మెయిన్ కెమెరా, G77లో 108MP మెయిన్ కెమెరా ఇవ్వనున్నారు. రెండింటిలోనూ 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉంటాయి. ఇంకా ఇందులో 5200mAh బ్యాటరీతో పాటు 30W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అందించనున్నారు. అలాగే IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటాయి. ఈ ఫోన్లు Android 16తో రానున్నాయి. 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, USB Type-C వంటి ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. ఇప్పటివరకు ధర, అమ్మకాల తేదీపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే లాంచ్ త్వరలోనే జరిగే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా.
