NTV Telugu Site icon

దళిత బంధుకు మద్దతుగా ఇవాళ మోత్కుపల్లి దీక్ష

దళిత బంధు పథకానికి మద్దతుగా ఇవాళ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు దీక్ష చేపట్టనున్నారు. దళిత బంధు పథకం పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ దీక్ష చేపట్టనున్నారు మోత్కుపల్లి నర్సింహులు. కాసేపట్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న మోత్కుపల్లి నర్సింహులు.. 10 గంటల సమయంలో ఆయన నివాసంలో దీక్ష చేయనున్నారు. ఈ దీక్షను ఇవాళ సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగించనున్నారు. కాగా..ఇటీవలే తెలంగాణ సర్కార్‌ దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా… ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున తెలంగాణ సర్కార్‌ ఇవ్వనుంది. అయితే… ఈ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌ నియోజకవర్గంలోనే కాక… తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.