Site icon NTV Telugu

Punjabi Mother : మదర్స్ డేకి వెరైటీ గిఫ్ట్ అడిగిన పంజాబీ మదర్

Punjab Mother

Punjab Mother

మదర్స్ డే రోజు మన అమ్మగారికి శుభాకాంక్షలు చెప్పడం.. కానుకలు కొనివ్వడం ఇవన్నీ కామనే.. అయితే ఓ పంజాబీ మదర్ మాత్రం తనకు బిడ్డల నుంచి ఎలాంటి గిఫ్ట్ కావాలని ఆశిస్తోందో చెప్పిన తీరు ఫన్నీగా అనిపించినా అందర్నీ చాలా ఆలోచింపచేస్తోంది. తన పిల్లల నుంచి తల్లిదండ్రులు ఏదీ ఆశించరు. నిజంగా వారు కోరుకునేది ఏదైనా ఉందంటే బిడ్డలు మంచి దారిలో నడవడం.. జీవితంలో సెటిల్ అవ్వడం మాత్రమే. మదర్స్ డే అనగానే చాలామంది తమ తల్లులకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. అయితే పంజాబీ మదర్ సోనియా ఖత్రీ ఏం కోరుకుంటోందో వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సోనియా ఖత్రీ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Also Read : Charmy Kaur: లైగర్ ఎగ్జిబిటర్ల ధర్నాపై చార్మీ రియాక్షన్.. ఏం చెప్పిందంటే?

తనకు ఎలాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ అక్కర్లేదని.. దయ చేసి నాకు నిజంగా సంతోషాన్ని ఇచ్చే పనులు చేయ్యాలంటూ తన పిల్లలకు రిక్వెస్ట్ చేసింది. ఉదయం 6 గంటలకు నిద్ర లేవండి.. మధ్యాహ్నం 12 గంటలకు కాదు.. అలాగే ఇంట్లో వండిన ఆహారం తినండి.. బయట ఫుడ్ ఆర్డర్ చేయవద్దని ఆమె కోరింది. రోజంతా సోషల్ మీడియాను ఉపయోగించవద్దని నవ్వుతూనే తన అభిప్రాయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియో చెప్పింది.

Also Read : Ammaku Prema Kammani Vanta : అమ్మకు ప్రేమతో కమ్మనివంటలో మాధవిలత చెప్పిన సీక్రెట్స్‌

తల్లి పిల్లల నుంచి ఇలాంటి అంశాలను బహుమతిగా కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదని నెటిజన్లు అంటున్నారు. ఇది తమ పిల్లలకు కూడా వర్తిస్తుందని.. నువ్వు చెప్పింది అక్షరాల నిజమే అక్కా.. అని నెటిజన్స్ అంటూ తమ అభిప్రాయాలను పోస్టు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు సెల్ ఫోన్ మోజులో పడి ఇంట్లో వారిని కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఒకే ఇంట్లో ఉంటున్నా.. ఎవరి గదుల్లో వారు.. ఎవరి ఫోన్లతో వారు ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో సోనియా ఖత్రీ తన బిడ్డల నుంచి ఇలాంటి గిఫ్ట్ లు కోరుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదని ఆమె పోస్ట్ చేసిన వీడియో చూసిన వారు అంటున్నారు.

Exit mobile version