ఈ భూమి మీద తల్లి ప్రేమకు సరిసాటి ఏదీరాదు అనడంతో అతిశయోక్తి లేదు. భూమి మీద పుట్టిన ఏ జీవైనా అమ్మప్రేమ మాధుర్యం కోసం చూస్తూనే ఉంటాయి. ముఖ్యంగా చిన్న వయసులో తల్లిని విడిచి మూగజీవులు సైతం ఉండలేవు. అయితే.. ఇదే మానవుల్లో ఇంకా ఎక్కువనే చెప్పాలి. కన్నబిడ్డ కాసింత సేపు కనిపించకుండా పోతేనే విలవిలలాడే తల్లులు ఎంతోమంది ఉన్నారు. అయితే.. 45 రోజుల పసిపాపతో తెలంగాణలో తొలిసారి జరుగుతున్న గ్రూప్ 1 పరీక్ష రాసేందుకు వచ్చింది ఓ మహిళ. వివరాల్లోకి వెళితే.. వరంగల్ ఏఎస్ఎం కాలేజ్ లో గ్రూప్ వన్ పోటీ పరీక్ష నిమిత్తం హుస్నాబాద్ కు చెందిన సుమలత వచ్చింది.
Also Read : Hyderabad Rains : హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
అయితే సుమలత నెల 15 రోజుల క్రితమే పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చింది. వెంటనే ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న గ్రూప్ వన్ పరీక్ష ఉండడంతో అటు కన్నా ప్రేమ, ఇటు భవిష్యత్తు రెండింటి మధ్య సతమతమవుతూ వరంగల్ ఏఎస్ఎంలో జరిగే పరీక్షకు హాజరైంది. ఈ తరుణంలో పాప తండ్రి తరుణ్ పాపను పట్టుకొని ఆడిస్తున్న క్రమంలో పాల కోసం ఏడుస్తున్న పాపను పాలు పట్టిస్తామని, తల్లి వద్దకు పంపాలని అక్కడ ఉన్న అధికారులను రిక్వెస్ట్ చేయగా రూల్స్ విరుద్ధంగా ఏమి చేయలేమని చెప్పడంతో గత్యంతరం లేక పాప తండ్రి తరుణ్ డబ్బా పాలు పెడుతూ పాపను ఆడిస్తున్నారు. ఈ ఘటన పలువురిని కల్చివేస్తుంది.