NTV Telugu Site icon

Rohit Mother: నేను ఉన్నంత కాలం రోహిత్ వేముల ఆత్మహత్యపై పోరాటం చేస్తా..

Vemula Rohit

Vemula Rohit

ఆత్మహత్య చేసుకున్న హెచ్సీయూ(HCU) విద్యార్థి నేత రోహిత్ వేముల క్లోజర్ రిపోర్ట్ను రోహిత్ తల్లి రాధిక వ్యతిరేకిస్తున్నారు. రిపోర్ట్ను పూర్తిగా మార్చేసారని హెచ్సీయూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. తాజాగా.. రోహిత్ వేముల తల్లి రాధిక మీడియాతో మాట్లాడారు. రోహిత్ వేముల ఎస్సీ కాదు అని పోలీసులు రిపోర్ట్ను హైకోర్టులో సబ్మిట్ చేశారని అన్నారు. రోహిత్ వేముల ముమ్మాటికీ ఎస్సీనేనని తెలిపారు. పోలీసులు రోహిత్ వేముల కులం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. రోహిత్ వేముల చదవలేక చనిపోయారు అని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారన్నారు.

Pawan Kalyan: నేను బ్రతికుండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను

రోహిత్ టాప్ స్టూడెంట్.. ఎంఎస్సీ(Msc) స్టేట్ 6th ర్యాంక్ తెచ్చుకున్నాడు.. జేఆర్ఎఫ్ లో క్వాలిఫై అయ్యాడని తల్లి రాధిక చెప్పారు. చదవలేక చనిపోయాడు అని పోలీసుల చెప్తున్న మాట దారుణం.. తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రోహిత్ వేముల రాసిన పోయెట్రీలు చదివితే రోహిత్ అంటే ఏంటో అర్థం అవుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసాము.. కేసు రీ ఓపెన్ చేసి పునర్విచారణ చేస్తామని చెప్పారన్నారు. ఇప్పటి వరకు పోలీసులు చేసింది మొత్తం తప్పుడు ఎంక్వయిరీ.. కేసు పునర్విచారణ నిష్పక్షపాతంగా చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తల్లి రాధిక తెలిపింది.

Teacher Arrest: విద్యార్థికి బలవంతంగా పోర్న్ వీడియో చూపించిన కేసులో టీచర్ అరెస్ట్.. ఎక్కడంటే..

అంతేకాకుండా.. స్టూడెంట్ల మీద పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని సీఎంను కోరామని రోహిత్ తల్లి రాధిక చెప్పారు. బీజేపీకి చెందిన వ్యక్తులకు అనుకూలంగా కేసు క్లోజ్ చేశారని.. రోహిత్ వేముల సర్టిఫికెట్స్… ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ లాంటిది కాదు.. కష్టపడి చదివి సాధించినవి అని అన్నారు. రోహిత్ వేముల కేసు క్లోజ్ అయింది అని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు… తాను ఉన్నంత కాలం రోహిత్ వేముల ఆత్మహత్యపై పోరాటం చేస్తానని తెలిపారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణం అయిన వారికి శిక్షపడేదాకా పోరాడతానని పేర్కొన్నారు.