ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఓ మహిళ.. తనకంటే చిన్న వయస్కుడైన యువకుడిని ప్రేమించింది. యువకుడి ప్రేమలో మునిగిపోయిన మహిళ.. ఇద్దరు పిల్లలు ఉన్నారనే సంగతే మర్చిపోయింది. విషయం భర్తకు తెలియండంతో ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. భర్త, పిల్లలను కాదనుకున్న ఆ మహిళ.. తనకు ప్రియుడే దిక్కని నిశ్చయించుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది.
కరీంనగర్‌కు చెందిన సంధ్య మహిళకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంకు చెందిన అరవింద్ అనే యువకుడితో సంధ్యకు స్నాప్‌చాట్‌లో పరిచమైంది. ఇద్దరు ఏడాది కాలంగా ప్రేమాయణం కొనసాగించారు. ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయం మర్చిపోయి యువకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. విషయం సంధ్య భర్తకు తెలియడంతో ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు.
Also Read: Asia Cup 2025: యూఏఈ సంచలనం తృటిలో మిస్.. సూపర్-4కు పాకిస్థాన్!
సంధ్య బుధవారం రోజున మహిళా సంఘాలతో అరవింద్ ఇంటి ముందుకు వచ్చి ఆందోళన చేపట్టింది. దీంతో గ్రామ ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు. ‘ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా.. ఈ పని ఏంటి?’ అని స్థానికులు ప్రశ్నించగా.. తనకు అరవింద్ కావాలని, అతని దగ్గరే ఉంటానని చెప్పింది. తన భర్త ఇంట్లోనుండి వెళ్లగొట్టాడని, ఇప్పుడు అరవిందే తనకు దిక్కు అని వాపోయింది. అరవింద్ తనను పెళ్లి చేసుకుంటా అంటున్నాడని, అతడి అమ్మానాన్నలే ఒప్పుకోవడం లేదని తెలిపింది. అరవింద్ తనను పెళ్లి చేసుకోవాలని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఘటన పెద్దపల్లి మండలంలో హాట్ టాపిక్‌గా మారింది.
