Site icon NTV Telugu

Tragedy : ఎంతపని చేశావమ్మా..! ఇద్దరు పిల్లల్ని నరికి చంపి.. బిల్డింగ్ పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య

Gajularamarama Incident

Gajularamarama Incident

Tragedy : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం ప్రాంతంలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మానసికంగా చితికిపోయిన ఓ తల్లి, తన ఇద్దరు చిన్నారులను వేట కొడవలితో నరికి, అనంతరం బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన మృతిచెందిన తల్లి తేజస్విని రెడ్డిగా, ఆమె కుమారులు హర్షిత్ రెడ్డి (7), ఆశిష్ రెడ్డి (5) గా పోలీసులు వెల్లడించారు. తేజస్విని తన చిన్న కొడుకు ఆశిష్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు, పోలీసులు రామ్రాజ్‌ అసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే ఆశిష్‌ మృతి చెందాడు. అయితే.. హర్షిత్ రెడ్డి ఘటన స్థలంలోనే మృతి చెందాడు.

తేజస్విని రెడ్డి, ఈ ఘటనకు ముందు ఆరుపేజీల సూసైడ్ నోట్ రాసి ఉంచింది. సూసైడ్ నోట్ లో ఆమె తన మనోవేదనను, కుటుంబపరమైన ఒత్తిడులను వివరించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలానికి బాలనగర్ డీసీపీ, జీడిమెట్ల సీఐలు చేరుకుని క్లూస్ టీమ్ తో పరిశీలనలు చేపట్టారు. ఈ సంఘటన గాజులరామారంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.

Jagadambika Pal : ‘వక్ఫ్ చట్టంలో ఏదైనా తప్పు కనిపిస్తే, రాజీనామా చేస్తా’

Exit mobile version