Site icon NTV Telugu

Maharastra: తండ్రి చనిపోయాడని… కూతురును బిల్డింగ్ పై నుంచి తోసేసి చంపిన తల్లి

Murder

Murder

ఓ మహిళ కన్న మమకారాన్ని మరిచింది. 39 రోజుల వయసు ఉన్న చిన్నారిని 14వ అంతస్తు నుంచి పడేసి కర్కశంగా చంపేసింది. అయితే కొన్నాళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతున్నందునే మహిళ ఈ ఘోరానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ విషాదకరమైన ఘటన  మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో చోటు చేసుకుంది.  ముంబాయిలోని ములుంద్‌లో ఈ వార్త తీవ్ర కలకలం రేపుతుంది.

Also Read: Tecno Phantom V Flip 5G: రూ.50 వేలలోపే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు, కంప్లీట్ వివరాలు ఇవే

వివరాల ప్రకారం  నిందితురాలు మనాలి మెహతా తండ్రి గతేడాది చనిపోయాడు. అయితే ఆయనతో మనాలికి మంచి అనుబంధం ఉండటంతో తండ్రి చావును తట్టుకోలేకపోయింది. దీంతో తీవ్ర డిప్రెషన్ తో బాధపడేది. దాని నుంచి బయటపడటానికి ఆమె చికిత్స కూడా తీసుకుంటుంది. ఆమె ఎప్పుుడూ తన తండ్రి గురించే చెబుతూ ఉండేది. ఈ క్రమంలో ఆమె తల్లిగా మారి ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఇప్పటికైనా ఆమె మారుతుందని అందరూ అనుకున్నారు. అయితే అది జరగలేదు. కూతురు హష్వీకి తాతయ్య ఫోన్ చేస్తున్నాడని ఆమె తన కుటుంబ సభ్యుల వద్ద పదే పదే చెబుతూ ఉండేది. అయితే ఉన్నట్టుండి సెప్టెంబర్ 21 తెల్లవారుజామున 4 గంటలకు 14వ అంతస్తులోని బెడ్‌రూమ్‌ కిటికీ తెరిచి చిన్నారి హష్వీని కిందకు విసిరేసింది. అప్పటికి చిన్నారి వయసు 39 రోజులు. దీంతో ఆ కుటుంబంలోని వారందరూ షాక్ కు గురయ్యారు. చిన్నారిని కాపాడదామని ప్రయత్నించగా 14వ అంతస్తు నుంచి పడటంతో తీవ్రగాయాలయ్యాయి మరణించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు తల్లి మనాలి పై హత్య కేసు నమోదు చేశారు. ఆమె డిప్రెషన్ లో ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే ఆమె మానసిక చికిత్స నేపథ్యంలో నిందితురాలిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. అయితే ఈ ఘటన మాత్రం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

 

Exit mobile version